ఈవారం ‘ఎమోషనల్‌ ఇంటలిజెన్స్’ కే.. !

This week belongs to Daniel Goleman Says Super Star Mahesh Babu On Instagram

కరోనా వల్ల ఒక రకంగా హీరో హీరోయిన్స్ కు షూటింగ్స్ లో పాల్గొనే పని లేకుండా పోయిందేమో కానీ.. మరోరకంగా మాత్రం లాక్‌డౌన్ సమయాన్ని సెలబ్రిటీలు బాగా వాడుకుంటున్నారు. నచ్చిన పనులు చేయడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, కొత్త ఇష్టమైన పనులు నేర్చుకోవడం వంటివన్నీ చేసేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు లాక్ డౌన్ లో దొరికిన టైంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. తన కుటుంబంతో కలిసి హాయిగా గడిపేస్తున్నారు. పిల్లలతో ఆడుకుంటూ వారితో కాలక్షేపం చేస్తున్నాడు. వాటికి సంబందించిన వీడియోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే వున్నారు నమ్రత, మహేష్. ఇక మహేశ్ బాబు కు పుస్తకాలు చదివే అలవాటు కూడా ఉందన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో పుస్తకం చదువుతున్నట్టు తెలిపాడు. ‘ఎమోషనల్ ఇంటెలిజన్స్.. సైంటిఫిక్ .. సంచలనాత్మకం.. అందరూ చదవాల్సిన పుస్తకం. ఇక ఈ వారం అంతా డానియల్ గోల్ మెన్ కే కేటాయిస్తున్నా..’ అంటూ మహేశ్ ఆ పుస్తకాన్ని చదువుతున్న విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

ఇక ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఆగష్టు లేదా సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‌

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + three =