ఈ లాక్ డౌన్ టైంలో సెలబ్రిటీస్ కు షాకిస్తున్న మరో అంశం ఏంటంటే కరెంట్ బిల్. ఊహించని రీతిలో వస్తున్న ఈ కరెంటు బిల్ కు షాకవుతున్నారు. ఇప్పటికే.. ఇప్పటికే కార్తీక, తాప్సీ, శ్రద్దదాస్ ఇలా చాలామంది తమకు వచ్చిన కరెంట్ బిల్ చూసి షాక్ తో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా ఈ లిస్ట్ లో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా చేరిపోయాడు. ఇక ఇదే విషయాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ కాస్త కామెడీ చేశాడు. `ఇంటి దగ్గర కరెంట్ మీటర్ చూస్తుంటే చిన్నప్పటి ఆటో రిక్షా మీటర్ గుర్తొస్తోంది. ఏంది సార్ ఆ బిల్లు. ఎవరి ఇంటికి ఎక్కువ బిల్లు వచ్చిందని ఆన్‌లైన్లో వార్ ప్రారంభమైనా ఆశ్చర్యం లేదు. ఈ బిల్లులను చూస్తుంటే కొత్త సినిమాల వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్స్‌లా అనిపిస్తోందని సందీప్ కామెంట్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా విజయాపజయాలతో పని లేకుండా సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో మరో సినిమాను కూడా ఈ మధ్యనే ప్రకటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ తన ప్రతిష్ఠాత్మక బ్యానర్ ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించనున్నారు. ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
The Electricity Board meter at home reminds of the unpredictable Auto Rickshaw meter in my childhood 😂
Endi Saar Aaa Billu 🙇🏻 …
Next evari Intiki ekuva bill vachindi ani online war start ayina Ascharyam ledhu 😂
EB bills be like weekend collections of new Releases 😂— Sundeep Kishan (@sundeepkishan) June 30, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: