దిల్ రాజు గారి సలహా వల్ల నా కెరీర్ మారిపోయింది..!

Producer Dil Raju Advice Has Changed My Film Career Says Tollywood Actor Naveen Chandra

అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నవీన్ చంద్ర. ఆ సినిమాలో నవీన్ చంద్ర నటనకు ప్రశంసలు దక్కడమే కాదు.. ఇండస్ట్రీకి ఒక మంచి నటుడు దొరికాడనుకున్నారు అందరూ. అయితే ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాలేవీ నవీన్ చంద్రకు పెద్దగా కలిసిరాలేదు. అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’ సినిమాతో ఈ సారి విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్ బాల్ రెడ్డి అనే ఒక మంచి పాత్రను ఇవ్వడంతో నవీన్ చంద్ర కెరీర్ టర్న్ అయ్యింది. అరవింద సమేత చిత్రం తర్వాత మళ్లీ బిజీ అయ్యాడు. ప్రస్తుతం ఇక పక్క హీరో గా చేస్తూనే మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

ఇక తన కెరీర్ అవ్వడానికి దిల్ రాజు ఇచ్చిన సలహానే కారణం అంటున్నాడు నవీన్ చంద్ర. ప్రస్తుతం భానుమతి రామకృష్ణ అనే సినిమాలో నటిస్తున్నాడు నవీన్ చంద్ర. ఈ సినిమా త్వరలోనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీన్ చంద్ర.. మంచి క్యారెక్టర్ వస్తే అలాంటి పాత్రల్లో కూడా నటించమని దిల్ రాజు నవీన్ కు సలహా ఇచ్చాడట. ఆ సలహా ను సీరియస్ గా తీసుకొని మంచి కీలక పాత్రలను ఎంపిక చేసుకుంటూ.. తనలోని నటనను ఇంకా ఆవిష్కరించుకునే అవకాశం దక్కిందని చెపుతున్నాడు. అంతేకాదు ఈ రోల్స్ వల్ల తాను చాలా హ్యాపీగా ఉన్నానని అంటున్నాడు.

తెలుగులోనే కాదు తమిళం కూడా నవీన్ చంద్ర విలన్ పాత్రలో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే ధనుష్ హీరోగా ‘పట్టాస్’ సినిమాలో మెయిన్ విలన్ గా నటించి మరోసారి తన మార్క్ ను చూపించాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సర్ సినిమాలో.. బాలయ్య-బోయపాటి సినిమాలో నటించనున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here