కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 164

సినిమా వార్తలు

ట్వీట్ తో క్యూరియాసిటీ పెంచిన 'కె.జి. ఎఫ్ 2' డైరెక్టర్..!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వస్తున్న కె.జి.ఎఫ్ చాప్టర్ 2 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కె.జి.ఎఫ్ సినిమా మాములు రికార్డులు సృష్టించలేదు. తెలుగు, కన్నడ, హిందీ లో ఈ సినిమా స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. ఇక ‘కె.జి.ఎఫ్’ బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఈ సినిమాపై కూడా అదే రేంజ్ లో అంచనాలు పెంచుకున్నారు అభిమానులు. ఇక అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పెట్టకూడదన్న నేపథ్యంలో ఈ సినిమా అవుట్ ఫుట్ కోసం కోసం చిత్ర యూనిట్ అదే రేంజ్ లో కష్టపడుతున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రవితేజ కు జోడీగా రాశీఖన్నా ?

తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రాశీఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం 3 తమిళ మూవీస్ లో నటిస్తున్న రాశీఖన్నా ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. లాక్ డౌన్ సమయంలో బుక్ రీడింగ్, యోగా , తమిళ భాష ను నేర్చుకొంటూ , కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ రాశీఖన్నా టైమ్ పాస్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ బాబు ట్విట్టర్ రికార్డ్

సూపర్ హిట్ "రాజకుమారుడు " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన మహేష్ బాబు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. బెస్ట్ యాక్టర్ గా మహేష్ బాబు 8 నంది , 5 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉన్న మహేష్ బాబు కు మహిళాభిమానులు కూడా ఎక్కువే. కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత బ్లాక్ బస్టర్ "గీత గోవిందం" మూవీ ఫేమ్ పరశు రామ్ దర్శకత్వంలో రూపొందే "సర్కారు వారి పాట " మూవీ షూటింగ్ లో మహేష్ బాబు పాల్గొంటారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అవ‌య‌వ‌దానం చేస్తున్నాం..!

‘వైద్యో నారాయణో హరి’.. అంటే వైద్యుడు దేవుడితో సమానం అని అర్ధం. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై వైద్యులే ముందుండి పోరాటం చేసి ప్ర‌జ‌ల ప్రాణాల్ని కాపాడుత‌న్నారు. వారే కనుక లేకపోయిఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. ఇక నిన్న జాతీయ వైద్యుల దినోత్సవం. ఈ నేపథ్యంలో.. డాక్ట‌ర్స్ డే సంద‌ర్భంగా జెనీలియా, రితేష్ లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే... తమ అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో జెనీలియా ఒక వీడియోను పోస్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్
Powerstar Pawan Decided To Take Deeksha For 4 Months
సాంగ్

4 నెలలపాటు చాతుర్మాస్య దీక్ష తీసుకున్న పవన్..!

కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఎన్నో విధాలుగా నష్టపోయింది. ఎంతోమంది జీవనోపాధి కోల్పోయారు. ఎంతో మంది తినడానికి తిండి లేక అల్లల్లాడుతున్నారు. ఇక ఇలాంటి పరిస్థితులు నుండి బయటపడాలని పవన్‌ కళ్యాణ్‌ చాతుర్మాస్య దీక్షను చేపట్టారు. దాదాపు నాలుగు నెలల పాటు ఈ దీక్ష చేయనున్నారు. ఆషాడం, శ్రావణం, భాద్రపదం, అశ్వీఇజమాసం కలిసి నాలుగు మాసాల పాటు ఈ దీక్ష కొనసాగుతుందట. ఒకటి కాదు రెండు కాదు పవన్ దాదాపు 20 సంవత్సరాలునుండి పవన్ ఈ ఈ దీక్ష చేస్తున్నట్టు తెలుస్తుంది. నాలుగు నెలలు పాటు దీక్షను చేసిన తర్వాత.. ఆఖరిగా హోమాన్ని నిర్వహించి విరమిస్తారు.ఇక ఈ దీక్షలో ఉన్ననంత కాలం పవన్ కళ్యాణ్ మాంసాహారానికి దూరంగా ఉంటారని…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ట్రోల‌ర్స్‌పై పోలీసులకు త‌రుణ్ భాస్క‌ర్ ఫిర్యాదు..!

సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ పై అప్పుడప్పుడు కామెంట్లు రావడం చూస్తూనే ఉంటాం. వాటికి వాళ్ళు కూడా అప్పుడప్పుడు రివర్స్ కౌంటర్ లు కూడా ఇస్తుంటారు. ఇక పరిస్థితి మరీ శృతి మించితే పోలీస్ ఫిర్యాదు ఇవ్వక తప్పదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కి. దానికి కారణం ఓ మలయాళ సినిమానే కారణం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక రేడియంట్ లుక్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!

ఇక టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక కరోనా లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయ్యి సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోలు, వీడియో లు షేర్ చేస్తూ రష్మిక టైమ్ పాస్ చేస్తుంది. ఇక అప్పుడప్పుడు తన వర్కౌట్లకు సంబంధించిన ఫొటోస్ కూడా షేర్ చేస్తుంటుంది. ఇక ఈ నేపథ్యంలో తాజాగా తాను పోస్ట్ చేసిన ఒక ఫొటో మాత్రం అభిమానులను ఆకట్టుకుంటుంది. వర్క్ అవుట్ అంటూ ఒక ఫొటో ను పోస్ట్ చేయగా ఆ ఫొటో లో రష్మిక రేడియంట్ లుక్ కు... అసలే ఎక్స్ప్రెషన్స్ క్వీన్ అనే పేరుంది.. ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరి నిజంగానే రష్మిక ఫేస్ లో ఉన్న గ్లో ను చూస్తుంటే ఆమె…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చైతు-సామ్ నుండి అదే నేర్చుకోవాలి..!

లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ ఇంటికే పరిమితమైన సోషల్ డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాకు మాత్రం దగ్గరగానే ఉంటూ అభిమానులకు మాత్రం అందుబాటులోనే వుంటున్నారు. ఇక ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీస్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించగా.. తాజాగా సుశాంత్ కూడా తన అభిమానులతో ముచ్చటించి పలు విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కిల్లర్ ఎక్స్ ప్రెషన్స్ తో పూజాహెగ్డే

సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలకు జోడీగా నటించిన మూవీస్ ఘనవిజయం సాధించడంలో పూజాహెగ్డే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారారు. పూజాహెగ్డే ప్రస్తుతం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ", "#Prabhas 20" మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి , రెండు బాలీవుడ్ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

థియేటర్స్ స్టాఫ్ కోసం ముందుకొచ్చిన మెగా ఫ్యాన్స్..!

గత నాలుగు నెలల నుండి కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉందొ చూస్తూనే ఉన్నాం. ఇక ఈలాక్ డౌన్ అందరికీ ఏమో కానీ పేదలకు మాత్రం ఒకరకంగా శాపంగా గా మారిందనే చెప్పొచ్చు. ఇప్పటికే సెలబ్రిటీస్ దగ్గరనుండి సామాన్య ప్రజల వరకూ ఎవరికి తోచింది వారు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కొంత మంది పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటే.. కొంత మంది నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. ఇక మెగా స్టార్ కూడా సినీ కార్మికుల కోసం ఇప్పటికే చిరు కరోనా వైరస్ చారిటీ పేరుతో విరాళాలు సేకరించి వారికి అండగా నిలిచిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దర్శకుడు రవిబాబు ఫీలింగ్స్

ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు రవిబాబు తన స్వంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పై నూతన నటీ నటులతో "క్రష్ " మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ ముందే 90శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. లాక్ డౌన్ సడలింపుతో షూటింగ్ జరుపుకున్న మొదటి చిత్రం "క్రష్ ". 26 మంది యూనిట్ మెంబర్స్ తో దర్శకుడు రవి బాబు టాకీ పార్ట్ కంప్లీట్ చేశారు. సాంగ్స్ చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

రకుల్ ప్రీత్ షూటింగ్ కు రెడీ

తెలుగు , తమిళ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీ , తమిళ మూవీస్ తో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి ఇంటికే పరిమితం అయిన రకుల్ ఫుడ్ , వర్కౌట్స్ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ , కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. షూటింగ్స్ ప్రారంభానికై ఆసక్తి తో ఎదురు చూస్తున్న రకుల్ ఒక హిందీ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సింగిలా?.. రిలేషనా? ఇలియానా సూపర్ కౌంటర్

దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. పోకిరి సినిమాతో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగి అప్పట్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్.. గోవా బ్యూటీ ఇలియానా. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించి చాలా కాలం పాటు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రత్యర్థులుగా తండ్రీ కొడుకులు..!

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో విక్రమ్-ధృవ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్రాన్స్ లో "దర్బార్ " మూవీ రీ రిలీజ్

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "దర్బార్ "తమిళ మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 2020 సంవత్సరం జనవరి 9వ తేదీ "దర్బార్ " మూవీ తమిళ భాష తో పాటు తెలుగు , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఛాలెంజింగ్ రోల్స్ ఇష్టం - కాజల్ అగర్వాల్

తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో మెడిటేషన్ , యోగా , వర్కౌట్ , టీవీ లో రామాయణం , మహాభారతం సీరియల్స్ చూస్తూ , భగవద్గీత, భాగవత పురాణాలు పఠిస్తూ , కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ, ఆన్ లైన్ క్లాసెస్ కు అటెండ్ అవుతూ కాజల్ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు ", "ఇండియన్ 2", "హేయ్ సనమిక (తమిళ ), "ముంబై సాగ "(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

శివానీ రాజ‌శేఖ‌ర్ బ‌ర్త్‌డే - ఇంట్ర‌డ‌క్ష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌కుడిగా పరిచయమవుతూ... తేజ స‌జ్జా, రాజశేఖర్ ముద్దుల తనయ శివానీ హీరో, హీరోయిన్లుగా కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పైన ఉంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ ను వదిలి ఉండలేనని అప్పుడే అర్థమైంది..!

లాక్ డౌన్ లో నమ్రత సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు, గౌతమ్, సితారలకు సంబంధించిన వీడియోస్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఇక ఎప్పుడూ వీడియోలు పంచుకునే నమ్రత ఇన్‌స్టాలో నిర్వహించిన ‘ఆస్క్‌ మీ యువర్‌ క్వశ్చన్’ అంటూ అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. మరి అభిమానులు ఎలాంటి ప్రశ్నలు అడిగారు.. నమ్రత ఎలాంటి సమాధానాలు చెప్పిందో చూద్దాం..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'టిక్ టాక్' నిషేధంపై యంగ్ హీరోల ఆసక్తికర సంభాషణ..!

భారత్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనా యాప్స్ ను భారత్ బ్యాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. చైనా యాప్స్ అనేక సెక్యూరిటీ సమస్యలకు కారణం అవుతాయని భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా టిక్ టాక్ యాప్ ను కూడా భరత్ బ్యాన్ చేసింది. ఇక ఈ టిక్ టాక్ బ్యాన్ పై ఇద్దరు టాలీవుడ్ యంగ్ హీరోలు సోషల్ మీడియా వేదికగా జరిపిన సంభాషణ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు.. నిఖిల్ ఇంకా సందీప్ కిషన్.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

టీజర్ అదిరింది రా..!

అల్లరి సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసిన నరేష్ ఇప్పటివరకూ మ్యాగ్జిమమ్ కామెడీ సినిమాలతోనే ప్రేక్షకులను అలరించాడు. తనకంటూ సెపరేట్ రూట్ ను క్రియేట్ చేసుకున్నాడు. మధ్యలో కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటించాడు. గమ్యం, శంభో శివ శంభో సినిమాల్లో ఇటీవలే వచ్చిన మహర్షి సినిమాలో కూడా ఫ్రెండ్ పాత్రలో నటించి తన నటనలో ఉన్న మరో యాంగిల్ ను కూడా చూపించాడు.

TFN Adminవాట్సాప్

షేర్