కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 154

సినిమా వార్తలు

'రాధేశ్యామ్' రొమాంటిక్ మూవీ కాదు.. 'అంతకుమించి'..!

ప్రభాస్ సినిమా నుండి అప్ డేట్ వస్తే ఎలా ఉంటుందో అభిమానులు చెప్పకనే చెప్పారు. వర్షం నీటికోసం చకోర పక్షి ఎలా ఎదురుచూస్తుందో.. అలానే ప్రభాస్ కొత్త సినిమా అప్ డేట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసారు.గతేడాది ఆగస్టులో సాహో వచ్చాక.. అప్పటి నుంచి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ కూడా రాలేదు. ప్రభాస్ ఫస్ట్ లుక్, సినిమా టైటిల్ ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా? అని కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూశారు. ఇక ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి కాస్త ఊరట కలిగించారు. ఇక ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. 6.3 మిలియన్ల ట్వీట్స్ తో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వెంకీ కుడుముల దర్శకత్వంలో రామ్ చరణ్ ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "రౌద్రం రణం రుధిరం " మూవీ లో అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత రామ్ చరణ్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీతో వెంకీ కుడుముల దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన "భీష్మ " మూవీ ఘనవిజయం సాధించింది.

Team TFNవాట్సాప్
Actor Naveen Polisetty Spy Thriller Movie Agent Sai Srinivasa Athreya Gets Remade In To Multiple Languages
సినిమా వార్తలు

"ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ " పలు భాషలలో రీమేక్ !

స్వధర్మ్ ఎంటర్ టైన్ బ్యానర్ పై స్వరూప్ RSJ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి , శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్ "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ " మూవీ 2019 సంవత్సరం జూన్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. చిన్నచిత్రం గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకాదరణ పొంది రికార్డ్ కలెక్షన్స్ తో భారీ చిత్రం గా నిలిచింది. నవీన్ పోలిశెట్టి డిటెక్టివ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

Team TFNవాట్సాప్
Tollywood Ace Producer MS Raju Is All Set To Give A Surprise To Audience With His Latest Movie Dirty Hari
సినిమా వార్తలు

"డర్టీ హరి" - మరో సర్ప్రైజ్ కు రెడీ అయిన ఎం.ఎస్ రాజు..!

డర్టీ హరి నుండి మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఎం.ఎస్ రాజు. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్ దానిలో భాగంగానే ట్రైలర్ ను రిలీజ్ చేశారు. విడుదలైన కొద్దిసేపటికే 1 మిలియన్ కి పైగా వ్యూస్ సంపాదించి టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఇక ఇప్పుడు మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా నుండి మొదటి నుండి పాట రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. `లెట్స్ మేక్ లవ్` అనే వీడియో పాటను ఈ నెల 24న రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పీపీఈ కిట్ లో లావణ్య త్రిపాఠి

సక్సెస్ ఫుల్ "అందాల రాక్షసి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లావణ్య హీరోయిన్ గా నటించిన "అర్జున్ సురవరం "మూవీ విజయం సాధించింది. లావణ్య ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్ " మూవీ లో హాకీ ప్లేయర్ గా నటిస్తున్నారు. కార్తికేయ హీరోగా రూపొందుతున్న "చావు కబురు చల్లగా " మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Tollywood Ace Director Puri Jagannadh Pens A Heart Warming Note To Actress Anushka Shetty
సినిమా వార్తలు

'అనుష్క'ను చూస్తుంటే గర్వంగా ఉంది..!

అరుంధతి, భాగమతి, రుద్రమదేవి,దేవసేన ఈ పేర్లు వింటే చాలు మనకు గుర్తొచ్చేపేరు అనుష్క. నేటి తరం నాయకులకు లేడీ ఒరిఎంటేడ్ సినిమాలు తీయడానికి ఒక రకంగా అనుష్కనే స్పూర్తి. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనుష్క. మొన్ననే ఈ సినిమా 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా.. పూరీ జ‌గ‌న్నాథ్ త‌న ట్విట్ట‌ర్‌లో.. అనుష్కపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసాడు. "ఆ అమ్మాయిని చూడగానే చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పారు నాగార్జున గారు. మా అనుష్క మొదటి సినిమా సూపర్ రిలీజ్ అయిన రోజు. సూపర్ నుండి నిశ్శబ్దం వరకు ఎన్నో మెట్లు ఎక్కి ఈ స్థాయిలో ఉన్న అనుష్కని చూస్తుంటే…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దర్శకుడు ఆర్ జి వి కి నిఖిల్ కౌంటర్

ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ మూవీస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వివాదాస్పద చిత్రాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకుల విమర్శలు అందుకుంటున్నారు. వర్మ ప్రస్తుతం "పవర్ స్టార్ " మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇది పవర్ స్టార్ బయోపిక్ కాదు అని అనౌన్స్ చేసిన వర్మ పవన్ కళ్యాణ్ , చిరంజీవి పోలిన మనుషులతో "పవర్ స్టార్ " మూవీ ని రూపొందిస్తున్నారు. ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ పరిస్థితి గురించి ఈ మూవీ రూపొందించినట్టుగా ఉంది.

Team TFNవాట్సాప్
Bollywood Actor Sanjay Dutt To Play The Antagonist Role In Mega Star Chiranjeevi Acharya Movie
సినిమా వార్తలు

'చిరు' తో ఢీ కొట్టనున్న 'అధీర'..?

చిరు సినిమా అంటే చాలు రోజుకో వార్త వస్తూనే ఉంటది. ఇక లూసిఫర్ సినిమాపై అయితే ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా లూసిఫర్ సినిమాల పాత్రల గురించి అయితే రోజుకో రూమర్ వస్తుంది. మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. 'సాహో' ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘లూసిఫర్’ మలయాళ వెర్షన్‌లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే మొదట ఈ పాత్రను తెలుగులో ప్రముఖ నటుడు రెహ్మాన్ పోషించనున్నట్టు వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఇప్పుడు మరో పేరు…

TFN Adminవాట్సాప్
Acharya Movie Makers Plans To Erect A Massive Temple Set For Shooting Purpose
షూటింగ్ అప్‌డేట్

"ఆచార్య " మూవీ కి భారీ టెంపుల్ సెట్

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా "ఆచార్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ కథానాయిక. కరోనా మహమ్మారి కారణం గా 4 నెలలు షూటింగ్ నిలిచిపోయిన "ఆచార్య " మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

Team TFNవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ రూమర్స్ పై క్లారిటీ - నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు..!

త్వరలో బిగ్ బాస్ సీజన్4 మొదలు కానున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఎప్పుడైతే షో మొదలైందో అప్పటినుండి పలువురు హీరోల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే యంగ్ హీరో కార్తికేయ తాను నటించడం లేదంటూ క్లారిటీ ఇచ్చేసాడు. ఇక ఇప్పుడు మరో హీరోకూడా తనపై వస్తున్న రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు తరుణ్. తరుణ్ సీజన్ 4లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు అంటూ చాలా రోజులనుండే వార్తలు అందుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Who Do You Think Is The Best Dancer Among These Tollywood Stars?
స్పెషల్

పోల్ గేమ్: టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్ ? మీ ఓటు

అల్లు అర్జున్ :మ్యూజికల్ హిట్ "గంగోత్రి " మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ "ఆర్య", "బన్నీ ", దేశముదురు , "పరుగు ", బద్రీనాథ్ ", "జులాయి" , "ఇద్దరమ్మాయిలతో " , "S/O సత్యమూర్తి ", "సరైనోడు ", DJ", "అల వైకుంఠపురములో .. వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లోని సాంగ్స్ లో ట్రెమండస్ గా డ్యాన్స్ చేసి ప్రేక్షక, అభిమానులను అలరించారు. "అల వైకుంఠపురములో .. మూవీ సాంగ్స్ ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. అభిమానులు స్టైలిష్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "పుష్ప" మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

లాక్ డౌన్ కి థ్యాంక్స్ - రష్మిక

బ్లాక్ బస్టర్ "కిరిక్ పార్టీ " కన్నడ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన రష్మిక నటించిన "అంజనీపుత్ర ", "చమక్ " కన్నడ మూవీస్ విజయం సాధించాయి. బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "గీత గోవిందం" మూవీ ఘనవిజయంతో స్టార్ హీరోయిన్ హోదా అందుకున్నారు. తరువాత రష్మిక నటించిన "యజమాన "కన్నడ మూవీ సూపర్ హిట్ అయ్యింది. "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రష్మిక ప్రస్తుతం "పుష్ప "(తెలుగు ), "పొగరు " (కన్నడ ) మూవీస్ లో నటిస్తున్నారు. "సుల్తాన్ "మూవీ తో కోలీవుడ్ లో…

Team TFNవాట్సాప్
Majili Movie Fame Actress Divyansha Kaushik To Play The Lead Role In Ajay Bhupati Mahasamudram Movie
సినిమా వార్తలు

"మహాసముద్రం " మూవీ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్

సెన్సేషనల్ హిట్ "RX 100 " మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన అజయ్ భూపతి తన రెండవ మూవీ గా యాక్షన్ ఎంటర్ టైనర్ "మహాసముద్రం " రూపొందించనున్న విషయం తెలిసిందే. శర్వానంద్ హీరోగా రూపొందనున్న ఈ మూవీ లో కథానాయికగా సాయి పల్లవి ని ఎంపిక చేయాలని దర్శకుడు అజయ్ భావించారు. సాయి పల్లవి ప్రస్తుతం "విరాటపర్వం ", "లవ్ స్టోరీ " మూవీస్ తో బిజీగా ఉండడంతో సెట్ కాలేదు. ఇప్పుడు "మజిలీ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన దివ్యాంశ కౌశిక్ ను సంప్రదించడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Actress Rakul Preet Urges Everyone To Fight Against Corona Virus Together
సినిమా వార్తలు

కరోనా పై పోరాడుదాం - రకుల్ ప్రీత్ సింగ్

ప్రపంచంలోని ప్రజలందరి పైన కరోనా మహమ్మారి తన ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ప్రజల జీవన సరళి లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. లాక్ డౌన్ ముగిసినా ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఇక చిత్ర పరిశ్రమకు వస్తే పలు రకాలుగా నష్టపోయిన విషయం తెలిసిందే. సినీ సెలబ్రిటీస్ 4 నెలలుగా ఇంటికే పరిమితం అయ్యారు. షూటింగ్స్ కి అనుమతులు వచ్చినా పూర్తి స్థాయిలో షూటింగ్స్ జరగడం లేదు. చిత్ర పరిశ్రమ పై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

Team TFNవాట్సాప్
Tollywood Actress Raashi Khanna Once Again To Play Police Officer After Supreme Movie
సినిమా వార్తలు

మరోసారి పోలీస్ ఆఫీసర్ గా రాశీ ఖన్నా

సక్సెస్ ఫుల్ "ఊహలు గుస గుస లాడే "మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించి రాశీ ఖన్నా పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రాశీ ఖన్నా ప్రస్తుతం తమిళ మూవీస్ తో బిజీగా ఉన్నారు. "సైతాన్ కా బచ్చా ", "అరణ్మణై 3 " తమిళ మూవీస్ చిత్రీకరణ దశలో ఉన్నాయి. స్టార్ హీరో సూర్య కథానాయకుడి గా రూపొందనున్న "అరువా "మూవీ లో రాశీఖన్నా హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Varun Tej & Sai Pallavi Love Entertainer Fidaa Completes Three Years
సినిమా వార్తలు

3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న "ఫిదా"

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ "ఫిదా " మూవీ 2017 సంవత్సరం జులై 21 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. "ఫిదా " మూవీ లో సాయి పల్లవి తెలంగాణ యువతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని, బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
Actress Rakul Preet Singh To Play Twins In Her Latest Web Series Directed By Vijay
సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో ట్విన్స్ గా రకుల్ ?

ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో వెబ్ సిరీస్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణం గా థియేటర్స్ మూతపడడంతో వెబ్ సిరీస్ నిర్మాణం ఊపు అందుకుంది. నిర్మాతలు , దర్శకులు డిజిటల్ మీడియా పై దృష్టి సారించారు. వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉండడంతో స్టార్ హీరోయిన్స్ సమంత , కాజల్ అగర్వాల్ , తమన్నా , త్రిష , అంజలి వంటి వారు వెబ్ సిరీస్ లకు సై అంటున్నారు.

Team TFNవాట్సాప్
Jabardasth Fame Anchor Anasuya Bharadwaj Once Again To Play A Negative Shaded Role In Krishna Vamsi Rangamarthanda Movie
సినిమా వార్తలు

నెగటివ్ రోల్ లో క్రేజీ యాంకర్ అనసూయ ?

బుల్లితెర పై తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని నటిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "రంగస్థలం " మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ , సైమా , జీ సినీ అవార్డ్స్ అందుకున్నారు. "వకీల్ సాబ్" , "పుష్ప ", "ఆచార్య" మూవీస్ లో అనసూయ నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి రీల్ హీరో కాదు రియల్ హీరో -సుహాసిని

మెగా స్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఒక ప్రభంజనం. కోట్లాది అభిమానుల వెండి తెర వేలుపు. తన డ్యాన్సు లు , ఫైట్ లతో అభిమానులను అలరించే చిరంజీవి నటించిన పలు చిత్రాలు కలెక్షన్స్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేశాయి. సుమారు 10 సంవత్సరాల గ్యాప్ తరువాత టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ "ఖైదీ నెం 150 " మూవీతో చిరంజీవి తన స్టామినా ను నిరూపించారు. చిరంజీవి తో జోడీ కట్టిన హీరోయిన్స్ లో సుహాసిని ఒకరు. వీరిద్దరూ జంటగా నటించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
బిగ్ బాస్

'బిగ్ బాస్' పై వస్తున్న వార్తలన్నీ రూమర్సే..!

తెలుగులో కూడా బిగ్ బాస్ మంచి ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్ లు రాగా మూడు సీజన్ లు మంచి నాలుగో సీజన్ కు సన్నద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఇప్ప‌టికే సెల‌బ్రెటీల ఫైన‌ల్ లిస్టు కూడా త‌యారైనట్టు.. 12 మందితోనే కేవలం 50 రోజుల నిడివితో ఈ షో.. న‌డిపిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పటికే బిగ్ బాస్ కోసం పలువురిని ఎంపిక చేసుకున్నట్టు వార్తలు రాగా ఇప్పుడు కార్తికేయ పేరు తెరపైకి వచ్చింది. కార్తికేయ బిగ్ బాస్ లో నటిస్తున్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్