‘రాధేశ్యామ్’ రొమాంటిక్ మూవీ కాదు.. ‘అంతకుమించి’..!

Radhe Shyam Is Beyond A Routine Love Story Says Movie Director Radha Krishna

ప్రభాస్ సినిమా నుండి అప్ డేట్ వస్తే ఎలా ఉంటుందో అభిమానులు చెప్పకనే చెప్పారు. వర్షం నీటికోసం చకోర పక్షి ఎలా ఎదురుచూస్తుందో.. అలానే ప్రభాస్ కొత్త సినిమా అప్ డేట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసారు.గతేడాది ఆగస్టులో సాహో వచ్చాక.. అప్పటి నుంచి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ కూడా రాలేదు. ప్రభాస్ ఫస్ట్ లుక్, సినిమా టైటిల్ ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా? అని కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూశారు. ఇక ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి కాస్త ఊరట కలిగించారు. ఇక ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. 6.3 మిలియన్ల ట్వీట్స్ తో ఇంతకు ముందున్న ట్విట్టర్ రికార్డులను చెరిపేసింది. మరి ఫస్ట్ లుక్ కే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ‘ద తెలుగు ఫిలిం నగర్.కామ్’ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు డైరెక్టర్ రాధాకృష్ణ. ఈ సినిమా అంతకుమించి అంటున్నాడు రాధా కృష్ణ. పాన్ ఇండియా రేంజ్ ఉన్న ప్రభాస్ లాంటి హీరో ఈ సినిమాలో ఉంటే.. ఈ సినిమాపై చాలా అంచనాలు పెద్ద ఎత్తున ఉండటం సాధారణమే. చాలా ఇంటెన్స్ ఉన్న ప్రేమ కథ ఇది.. రొమాంటిక్ మూవీ మాత్రమే కాదు.. అంతకుమించి ఉంటుందని చెప్పారు. ఇప్పుడే అన్ని విషయాలు చెప్పలేను కానీ ఖచ్చితంగా ప్రభాస్-పూజాహెగ్డే ఈ కథతో మ్యాజిక్ మాత్రం క్రియేట్ చేస్తారని అంటున్నారు.

పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 18 =