సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లావణ్య హీరోయిన్ గా నటించిన “అర్జున్ సురవరం “మూవీ విజయం సాధించింది. లావణ్య ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా “A1 ఎక్స్ ప్రెస్ ” మూవీ లో హాకీ ప్లేయర్ గా నటిస్తున్నారు. కార్తికేయ హీరోగా రూపొందుతున్న “చావు కబురు చల్లగా ” మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ లో ఇంటికే పరిమితం అయిన లావణ్య త్రిపాఠి లాక్ డౌన్ బాధితులకు తన వంతు సాయం అందించారు. కరోనా వ్యాప్తి నివారణకై మాస్క్ లు తప్పని సరి కావడంతో తన ఫ్రెండ్ (డిజైనర్ ) తో కలసి లాభాపేక్ష లేకుండా మాస్క్ లు తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు. కొన్ని ఏరియాలలో మాస్క్ లు ఉచితంగా పంచారు. 4 నెలల తరువాత లావణ్య హైదరాబాద్ నుండి డెహ్రాడూన్ లో ఉన్న తన స్వంత ఇంటికి బయలుదేరారు. లావణ్య ముఖానికి మాస్క్ , కళ్ళకు స్పెషల్ గ్లాసెస్ , పీపీఈ కిట్ ధరించారు . గుర్తుపట్టలేకుండా ఉన్న లావణ్య ను చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురి అయ్యారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























