“డర్టీ హరి” – మరో సర్ప్రైజ్ కు రెడీ అయిన ఎం.ఎస్ రాజు..!

Tollywood Ace Producer MS Raju Is All Set To Give A Surprise To Audience With His Latest Movie Dirty Hari

డర్టీ హరి నుండి మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఎం.ఎస్ రాజు. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్ దానిలో భాగంగానే ట్రైలర్ ను రిలీజ్ చేశారు. విడుదలైన కొద్దిసేపటికే 1 మిలియన్ కి పైగా వ్యూస్ సంపాదించి టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఇక ఇప్పుడు మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా నుండి మొదటి నుండి పాట రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. `లెట్స్ మేక్ లవ్` అనే వీడియో పాటను ఈ నెల 24న రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ” ఇటీవల విడుదలైన మా డర్టీ హరి ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన లభించింది. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ రావడమే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖులనుండి ప్రశంసలు లభించాయి. రొటీన్ కి భిన్నంగా ప్రయత్నిస్తున్న మా డైరెక్టర్ ఎం.ఎస్.రాజు గారు కథని మలిచిన విధానం యూత్ ని బాగా ఆకట్టుకోనుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. త్వరలోనే ఈ చిత్రంలోని మొదటి పాట `లెట్స్ మేక్ లవ్` పూర్తి వీడియో తో ఈ నెల 24 న మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. మీ అందరికి కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం” అన్నారు.

కాగా శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానిశర్మలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం.ఎస్‌.రాజు దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగులు కూడా అందిస్తున్నారు. పరిచ గూడూరి శివ‌రామకృష్ణ‌, గూడురు స‌తీష్ బాబు, గూడురు సాయి పునీత్ సంయుక్తంగా ఎస్‌పీజే క్రియేష‌న్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + one =