“మహాసముద్రం ” మూవీ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్

Majili Movie Fame Actress Divyansha Kaushik To Play The Lead Role In Ajay Bhupati Mahasamudram Movie

సెన్సేషనల్ హిట్ “RX 100 ” మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన అజయ్ భూపతి తన రెండవ మూవీ గా యాక్షన్ ఎంటర్ టైనర్ “మహాసముద్రం ” రూపొందించనున్న విషయం తెలిసిందే. శర్వానంద్ హీరోగా రూపొందనున్న ఈ మూవీ లో కథానాయికగా సాయి పల్లవి ని ఎంపిక చేయాలని దర్శకుడు అజయ్ భావించారు. సాయి పల్లవి ప్రస్తుతం “విరాటపర్వం “, “లవ్ స్టోరీ ” మూవీస్ తో బిజీగా ఉండడంతో సెట్ కాలేదు. ఇప్పుడు “మజిలీ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన దివ్యాంశ కౌశిక్ ను సంప్రదించడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లండన్ లో మేకప్ , ఢిల్లీ లో ఫ్యాషన్ &మీడియా కమ్యూనికేషన్స్ లో ట్రైనింగ్ పొందిన దివ్యాంశ కౌశిక్ శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందిన “మజిలీ ” మూవీ తో టాలీవుడ్ , కార్తీక్ జి క్రిష్ దర్శకత్వంలో సిద్ధార్ధ్ హీరోగా రూపొందిన “టక్కర్ ” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. “మహాసముద్రం ” మూవీ లో హీరో శర్వానంద్ కు జోడీ గా దివ్యాంశ కౌశిక్ ఎంపిక కావడం ఆమె అదృష్టమే. హీరో శర్వానంద్ ప్రస్తుతం “శ్రీకారం ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 17 =