కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 155

సినిమా వార్తలు

భార్యకు ప్రేమతో బర్త్ డే విషెస్ - మంచి పనుల్ని ఇలాగే చెయ్..!

ఉపాసన సేవాగుణం గురించి అందరికీ తెలుసు. అపోలో వైస్ ఛైర్మన్‌గా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఉచితంగా మందుల పంపిణి కూడా చేస్తున్నారు ఈమె. అంతేకాదు ఉపాసన కు మూగ జీవాలు అంటే కూడా చాలా ఇష్టం. ఇటీవలే రాణి అనే ఇక ఏనుగును కూడా దత్తత తీసుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టీవ్ గానే ఉంటుంది ఉపాసన. హెల్త్ విషయంలో తనకు తెలిసిన చిట్కాలను, యోగాలకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. అంతేకాదు రామ్ చరణ్, చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చే వరకు ఉపాసన తన సోషల్ మీడియాలోనే వారికి సంబందించిన అప్ డేట్స్ అభిమానులకు అందిస్తూ ఉండేది. చెర్రీకి సంబంధించిన ఫొటోలు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఓ మై కడవులే' రీమేక్ - క్రేజీ కాంబో మరోసారి..!

మలయాళ సినిమా అంగమలై డైరీస్‌ను తెలుగులో ‘ఫలక్‌నుమా దాస్‌’గా తెరకెక్కించిన విశ్వక్‌ సేన్‌.. హీరోగా, దర్శకుడిగా మంచి విజయం సాధించాడు. ఇక గత ఏడాది శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమా చేసి దానితో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు విశ్వక్ కోసమే ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే మలయాళం హిట్ సినిమా 'కప్పేలా' తెలుగు రీమేక్ లో ఒక ప్రధాన పాత్ర కోసం సెలెక్ట్ అయ్యాడు.

TFN Adminవాట్సాప్
Makers Of Nithiin and Keerthy Suresh Starrer Range De Movie Plans To Release The Film For Dussehra This Year
సినిమా వార్తలు

"రంగ్ దే !" మూవీ దసరా రిలీజ్!

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తి సురేష్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే ! " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సాయి కుమార్ , నరేష్ , కౌసల్య , బ్రహ్మాజీ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా , PC శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

Team TFNవాట్సాప్
HIT DIRECTOR SAILESH KOLANU EXCLUSIVE INTERVIEW
సినిమా వార్తలు

శైలేష్ కొలను EXCLUSIVE Interview - ఎక్కువ మంది సినిమా చూడాలన్నదే నా స్వార్ధం

శైలేష్ కొలను డైరెక్టర్‌గా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన 'ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ 'హిట్'. చిన్న సినిమాగా విడుదలై ఈ సినిమా పెద్ద హిట్‌నే అందుకుంది. విడుదలైన మొదటి రోజే మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. ఇక ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రీమేక్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రాజ్ కుమార్ రావు నటిస్తున్న ఈ సినిమాను కూడా శైలేష్ కొలనే డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సందర్భంగా 'దతెలుగుఫిలింనగర్.కామ్' ఇంటర్వ్యూలో పాల్గొన్న శైలేష్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ జోడీగా దీపిక ఎంపిక పై కీర్తి సురేష్ స్పందన

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "మహానటి "ఫేమ్ నాగశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ "#Prabhas 21" మూవీ తెలుగు , తమిళ , హిందీ భాషలలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ అవకాశం మున్ముందు గొప్ప ప్రయాణానికి నాంది అని దీపిక ఆనందంతో ట్వీట్ చేశారు.

Team TFNవాట్సాప్
Super Star Mahesh Babu Accolades Oh My Kadavule Movie Team
సినిమా వార్తలు

"ఓ మై కడవులే " మూవీ టీమ్ కు మహేష్ బాబు అభినందనలు

హ్యాపీ హై పిక్చర్స్ బ్యానర్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో అశోక్ సెల్వన్ , రితికా సింగ్ జంటగా రూపొందిన ఫాంటసీ రొమాంటిక్ డ్రామా "ఓ మై కడవులే "తమిళ మూవీ 2020 సంవత్సరం ఫిబ్రవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో విజయ్ సేతుపతి , రమేష్ తిలక్ , దర్శకుడు గౌతమ్ మీనన్ అతిథి పాత్రలలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ప్రేక్షకాదరణ పొందిన ఈ మూవీ "HIT" మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా తెలుగు లో రీమేక్ కానుంది.

Team TFNవాట్సాప్
Kannada Super Star Kichcha Sudeepa Latest Film Phantom Movie Shooting Begins,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywood News,Phantom,Phantom Movie,Phantom Movie Latest News,Phantom Movie
షూటింగ్ అప్‌డేట్

స్టార్ హీరో సుదీప్ "ఫాంటమ్ " మూవీ షూటింగ్ ప్రారంభం

కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి ఎప్పుడూ బిజీగా వుండే సినీ సెలబ్రిటీస్ 4 నెలలుగా ఇంటికే పరిమితం అయ్యారు. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. అనూప్ భండారీ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా "ఫాంటమ్ "కన్నడ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభం అయ్యింది.

Team TFNవాట్సాప్
Tollywood Music Director Thaman Takes Hype On Ravi Teja Krack Movie To Sky High With His Latest Tweet
సినిమా వార్తలు

'క్రాక్' సినిమాపై అంచనాలను పెంచుతున్న థమన్ - 'మాస్ రీలోడెడ్'

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రాక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ పై ఇటీవలే పలు రూమర్స్ వస్తుండగా వాటికి క్లారిటీ కూడా ఇచ్చేసారు. ఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి ఉందని ఎట్టి పరిస్థితుల్లో థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పేసారు.

TFN Adminవాట్సాప్
Nandamuri Balakrishna Once Again To Portray A Powerful Role In NBK106
సినిమా వార్తలు

#NBK106 మూవీ లో బాలకృష్ణ పవర్ ఫుల్ క్యారెక్టర్

మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను , బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన "సింహా ", "లెజెండ్ " మూవీస్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా "# NBK106 " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక క్యారెక్టర్ లో బాలకృష్ణ అఘోరా గా కనిపించనున్నారు. "సింహా ", "లెజెండ్ " మూవీస్ లో బాలకృష్ణ రెండో కోణం శక్తిమంతం గా రూపొందిన విషయం తెలిసిందే. బాలకృష్ణ అఘోరా గా ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలియదు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ.. తమ ముద్దుల కూతురు.. అల్లరి పిడుగు సితార గురించి ప్రేత్యేకంగా చెప్పేదేముంది. ఇక కూతురు అంటే మహేష్ కు పంచ ప్రాణాలు అన్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఆ ప్రేమను మరోసారి తెలియచేసారు మహేష్. ఈ రోజు సితార పుట్టిన రోజు కావడంతో మహేష్ సితారకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పారు. తన ట్విట్టర్ లో సితారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మహేష్.. చాలా ఫాస్ట్ గా 8ఏళ్లు గడిచిపోయాయి..హ్యాపీ బర్త్ డే.. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో అది నీకు తెలియదు అంటూ సితార పై ఎంత ప్రేమ ఉందో మరొక్కసారి చూపించారు. న‌మ్ర‌త, గౌత‌మ్ కూడా సోష‌ల్ మీడియా ద్వారా సితార‌కి జ‌న్మ‌దిన…

TFN Adminవాట్సాప్
స్పెషల్

ఇన్ స్టా స్టోరీ : హ్యాపీ మూడ్ లో నభా నటేష్

"నన్ను దోచుకుందువటే " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కన్నడ బ్యూటీ నభా నటేష్ , ఆమూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో గుర్తింపు పొందారు. ఆ మూవీ ఘనవిజయం సాధించడంతో నభా నటేష్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నభా ప్రస్తుతం సాయి తేజ్ "సోలో బ్రతుకే సో బెటర్ ", బెల్లంకొండసాయి శ్రీనివాస్ "అల్లుడు అదుర్స్ " మూవీస్ లో నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆ మూవీ షూటింగ్స్ నిలిచిపోయాయి.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'బిచ్చగాడు 2' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

విభిన్నమైన సినిమా కథలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అభిమానులను ఏర్పరుచుకున్నాడు విజయ్ ఆంటోని. ఇక తమిళంలో పిచ్చైకరన్ సినిమాను తెలుగులో బిచ్చగాడు పేరుతో రిలీజ్ చేసి ఇక్కడ కూడా హిట్ కొట్టడమే కాకుండా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. అమ్మ సెంటిమెంట్ తెరకెక్కిన ఈ సినిమా 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. ఇప్పుడు ఇదే సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తయిందని ఇప్పటికే విజయ్ ఆంటోని చెప్పడం జరిగింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

స్టూడెంట్స్ కు రష్మిక సందేశం

రీసెంట్ గా టెన్త్ , ట్వెల్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయా క్లాస్ స్టూడెంట్స్ కు హీరోయిన్ రష్మిక సందేశం ఇచ్చారు. మీకొక విషయం చెబుతానంటూ రష్మిక .. 25% నుండి 28% వరకు స్టూడెంట్స్ కు వారి రిజల్ట్స్ తో సంతృప్తి గా లేరు. నిరాశ చెందవద్దు , మీరు ఊహించినదానికంటే జీవితం చాలా పెద్దదని , తన ఫ్రెండ్స్ చాలామంది రిజల్ట్స్ తో సంతోషంగా ఉన్నా , వారు చేసేదానికి వారి చదువుకు సంబంధం లేదని , మీకు నచ్చిన ఫీల్డ్ ను ఎంపిక చేసుకుని కృషి చేయండి అని రష్మిక సందేశం ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Tollywood Actor Nithiin and Shalini Kandukuri To Tie The Knot As On Earlier Fixed Date
సినిమా వార్తలు

ముహూర్తం ఫిక్స్... అనుకున్న డేట్ కే నితిన్ వివాహం..!

మొత్తానికి నితిన్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. కరోనా కారణంగా హీరో నితిన్ పెళ్లి వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మార్లు వాయిదా వేశారు. ఫిబ్రవరిలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత చాలా గ్రాండ్‌గా ఈ పెళ్లిని జరపాలని ఇరు కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల కుదర్లేదు. అయితే మరీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నారు ఇరు కుటుంబసభ్యలు. ఈ నేపథ్యంలోనే జులై 26న వీరిద్దరి వివాహం జరగనున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఫైనల్ గా అధికారికంగా కూడా ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

జాన్వీ కపూర్ మనసులోని కోరిక

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సూపర్ హిట్ "దఢక్ " మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. బ్లాక్ బస్టర్ "సైరాత్ "మరాఠీ మూవీ హిందీ రీమేక్ గా రూపొందిన "దఢక్ " మూవీ లో జాన్వీ కపూర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తరువాత ఆంథాలజీ మూవీ "ఘోస్ట్ స్టోరీస్ " లో ఒక కథలో నటించారు. జాన్వీ కపూర్ నటించిన లేడీ పైలట్ గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన "గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ ", జాన్వీకపూర్ ద్విపాత్రాభినయం చేసిన కామెడీ హారర్ "రూహీ అఫ్జానా " మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. జాన్వీ ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న "దోస్తానా 2 " మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సస్పెండెడ్ కాఫీ.. మీల్.... అంటే తెలుసా..? మనదగ్గర కూడా రావాలి..!

హీరో హీరోయిన్స్ అంటే కేవలం సినిమాలే కాదు సమాజ సేవలో కూడా ముందుంటున్నారు. ఎంతోమంది ఎన్నో సేవలు అందిస్తున్నారు. కొంతమంది బయటకి చెప్పకుండా కూడా చేస్తున్నారు. అందులో కాజల్ కూడా ఉంది. మూడో కంటికి తెలియకుండా సామాజిక సేవ చేయడంలో ముందుంటారు. అరకు ప్రాంతంలో అత్యంత వెనుకబడి ఉన్న గిరిజన పిల్లలకు ఉచిత విద్య, బాలికలు, యువతుల ఆరోగ్యానికి సంబంధించిన సేవలు, శానిటైజేషన్ లాంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా కాజల్ పెట్టిన పోస్ట్ ఒకటి అందర్నీ ఆలోచింపచేస్తుంది. అదేంటంటే...

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'డర్టీ హరి' ట్రైలర్ రిలీజ్..!

శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానిశర్మలు హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌.రాజు తెరకెక్కిస్తున్న సినిమా ’డ‌ర్టీ హ‌రి‘. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమాలో సన్నివేశాల్లో కూడా రొమాంటిక్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఈ ట్రైలర్ యూత్ ని బాగానే ఆక‌ట్టుకుంటుంది. అంతేకాదు సినిమాపై అంచనాలను కలిగిస్తుంది.

TFN Adminవాట్సాప్
Nandamuri Balakrishna and Singeetam Srinivasa Rao Cult Classic Movie Aditya 369 Completes 29 Years
సినిమా వార్తలు

29 వసంతాల "ఆదిత్య 369 "

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ , మోహిని జంటగా టైమ్ మెషీన్ నేపథ్యంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ "ఆదిత్య 369 " మూవీ 1991 సంవత్సరం జులై 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ మూవీ నేటితో 29 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన "జాణవులే " సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో బాలకృష్ణ కృష్ణ కుమార్, కృష్ణ దేవరాయలుగా ద్విపాత్రాభినయం చేశారు. ఆరెండుపాత్రలలోనూ బాలకృష్ణ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తారక్ ఈ విషయంలో సపోర్ట్ చేయండి..!

పాయల్ ఘోష్.. తెలుగు ప్రేక్షకులకు ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మంచు మనోజ్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన 'ప్రయాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ భామ. ఆ సినిమాలో హారిక పాత్రలో అలరించిన పాయల్.. ఆ తర్వాత ఎన్టీఆర్ ఊసరవెల్లిలో మెరిసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే వుంది. అయితే ఇటీవల ఎన్టీఆర్ గురించి మాట్లాడి మళ్ళీ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఎన్టీఆర్ మంచి సినిమా కుటుంబం నుండి వచ్చారని కానీ ఎన్టీఆర్ సినిమాల్లోకి రావడానికి ఎంతో కష్టపడ్డారని ఆమె పేర్కొంది. ఎన్టీఆర్ గతం గురించి తెలుసుకున్న…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వన్ ఇయర్ పూర్తి చేసుకొన్న "ఇస్మార్ట్ శంకర్ "

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ , పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ , ఛార్మి ) బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ "ఇస్మార్ట్ శంకర్ " 2019 సంవత్సరం జులై 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిధి అగర్వాల్ , నభా నటేష్ కథానాయికలు. మణిశర్మ సంగీతం ఈ మూవీ కి హైలైట్ గా నిలిచింది. బెస్ట్ డైరెక్టర్ , ప్రొడ్యూసర్ , మ్యూజిక్ డైరెక్టర్ లతో పాటు సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా రామ్ జీ సినీ అవార్డ్స్ గెలుచుకున్నారు.

Team TFNవాట్సాప్

షేర్