పోల్ గేమ్: టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్ ? మీ ఓటు

Who Do You Think Is The Best Dancer Among These Tollywood Stars?
  1. ఎన్టీఆర్ : సూపర్ హిట్ “స్టూడెంట్ నెం 1” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో డ్యాన్స్ , ఫైట్ లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. యంగ్ టైగర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఎన్టీఆర్ తన మొదటి సినిమా “స్టూడెంట్ నెం 1” లో డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “సింహాద్రి “, “యమదొంగ “, “అదుర్స్ ” , “బాద్ షా ” , “టెంపర్ “, ” జనతా గ్యారేజ్” మూవీస్ లోని సాంగ్స్ లో అద్భుతమైన స్టెప్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ ప్రస్తుతం “RRR” మూవీ లో నటిస్తున్నారు.

అల్లు అర్జున్ :మ్యూజికల్ హిట్ “గంగోత్రి ” మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ “ఆర్య”, “బన్నీ “, దేశముదురు , “పరుగు “, బద్రీనాథ్ “, “జులాయి” , “ఇద్దరమ్మాయిలతో ” , “S/O సత్యమూర్తి “, “సరైనోడు “, DJ”, “అల వైకుంఠపురములో .. వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లోని సాంగ్స్ లో ట్రెమండస్ గా డ్యాన్స్ చేసి ప్రేక్షక, అభిమానులను అలరించారు. “అల వైకుంఠపురములో .. మూవీ సాంగ్స్ ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. అభిమానులు స్టైలిష్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న “పుష్ప” మూవీ లో నటిస్తున్నారు.

రామ్ చరణ్ : మెగా స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సూపర్ హిట్ “చిరుత” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి బ్లాక్ బస్టర్ “మగధీర “మూవీ తో రికార్డ్స్ క్రియేట్ చేశారు. “రచ్చ “, “నాయక్ “, “ఎవడు “, “ధృవ “, “రంగస్థలం ” వంటి సూపర్ హిట్ మూవీస్ సాంగ్స్ లో అద్భుతంగా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిర్మాత గా మారి నిర్మించిన ఖైదీ నెం 150 మూవీ లో ని సాంగ్ లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. అభిమానులు మెగా పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే రామ్ చరణ్ ప్రస్తుతం “RRR”మూవీ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.

పోల్ గేమ్:టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్ ? మీ ఓటు

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here