‘చిరు’ తో ఢీ కొట్టనున్న ‘అధీర’..?

Bollywood Actor Sanjay Dutt To Play The Antagonist Role In Mega Star Chiranjeevi Acharya Movie

చిరు సినిమా అంటే చాలు రోజుకో వార్త వస్తూనే ఉంటది. ఇక లూసిఫర్ సినిమాపై అయితే ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా లూసిఫర్ సినిమాల పాత్రల గురించి అయితే రోజుకో రూమర్ వస్తుంది. మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ‘సాహో’ ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘లూసిఫర్’ మలయాళ వెర్షన్‌లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే మొదట ఈ పాత్రను తెలుగులో ప్రముఖ నటుడు రెహ్మాన్ పోషించనున్నట్టు వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. బాలీవడ్ హీరో సంజయ్ దత్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. లూసిఫర్ రీమేక్ లో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన అయితే లేదు కానీ వార్తలు మాత్రం వస్తున్నాయి. మరి ఈ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేస్తారో తెలియదు కానీ రోజుకో పేరు మాత్రం వినిపిస్తుంది. చూద్దాం మరి ఫైనల్ గా ఎవరో నటిస్తారో ఈ పాత్రలో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం చిరు కొరటాలతో ఆచార్య సినిమాతో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే ‘లూసిఫర్’ రీమేక్ సెట్స్ పైకి వెళ్లనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − five =