తెలుగులో కూడా బిగ్ బాస్ మంచి ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్ లు రాగా మూడు సీజన్ లు మంచి నాలుగో సీజన్ కు సన్నద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఇప్పటికే సెలబ్రెటీల ఫైనల్ లిస్టు కూడా తయారైనట్టు.. 12 మందితోనే కేవలం 50 రోజుల నిడివితో ఈ షో.. నడిపిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పటికే బిగ్ బాస్ కోసం పలువురిని ఎంపిక చేసుకున్నట్టు వార్తలు రాగా ఇప్పుడు కార్తికేయ పేరు తెరపైకి వచ్చింది. కార్తికేయ బిగ్ బాస్ లో నటిస్తున్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈవార్తలపై కార్తికేయ స్పందించి క్లారిటీ ఇచ్చాడు. బిగ్ బాస్ కోసం నన్ను ఎవరు సంప్రదించలేదు.. నేను బిగ్ బాస్ కి వెళ్తున్నట్టు వస్తున్న వార్తలు రూమర్స్ మాత్రమే అని స్పష్టం చేశాడు.
ఆర్ఎక్స్100 సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే తన నటనతో మంచి పేరుతెచ్చుకున్నాడు కార్తికేయ. ఆ తరువాత వరుసగా హిప్పీ గుణ369 90ఎంఎల్ సినిమాలు చేసాడు హీరోగానే కాకుండా నాని హీరోగా తెరకెక్కిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్2 బ్యానర్లో ‘చావుకబురు చల్లగా’ సినిమాతో విడుదలకు సిద్ధం అవుతున్నాడు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: