త్వరలో బిగ్ బాస్ సీజన్4 మొదలు కానున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఎప్పుడైతే షో మొదలైందో అప్పటినుండి పలువురు హీరోల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే యంగ్ హీరో కార్తికేయ తాను నటించడం లేదంటూ క్లారిటీ ఇచ్చేసాడు. ఇక ఇప్పుడు మరో హీరోకూడా తనపై వస్తున్న రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు తరుణ్. తరుణ్ సీజన్ 4లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు అంటూ చాలా రోజులనుండే వార్తలు అందుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిపై స్పందిస్తూ తరుణ్ “గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాల్లో, కొన్ని న్యూస్ పేపర్లలో నేను బిగ్‌బాస్‌లో పాల్గొంటున్నానని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజంలేదు. బిగ్ బాస్‌లో పాల్గొనే ఆలోచన కానీ, ఇంట్రెస్ట్ కానీ నాకు ఏమాత్రం లేదు. ఎప్పటికీ రాదు కూడా అని స్పష్టం చేసేసాడు. దయచేసి తప్పుడు వార్తలని ప్రచాయం చేయొద్దు” అని.. జాగ్రత్తగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి. మీ అందరి ప్రేమ, మద్దతుకి ధన్యవాదాలు’ అని తరుణ్ ప్రకటించాడు.
Actor #Tarun clarifies about #BiggBoss4 rumours!#Tharun #BiggBoss4Telugu #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/E0OhKqaaB2
— Telugu FilmNagar (@telugufilmnagar) July 21, 2020
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా నువ్వే కావాలి, నువ్వులేక నేనులేను, ప్రియమైన నీకు లాంటి సంచలన సినిమాలు చేసి ఇమేజ్ సంపాదించుకున్నాడు తరుణ్. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యాడు. ప్రస్తుతం బిజినెస్ చేసుకుంటూ ఉన్నాడు తరుణ్.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























