వెబ్ సిరీస్ లో ట్విన్స్ గా రకుల్ ?

Actress Rakul Preet Singh To Play Twins In Her Latest Web Series Directed By Vijay

ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో వెబ్ సిరీస్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణం గా థియేటర్స్ మూతపడడంతో వెబ్ సిరీస్ నిర్మాణం ఊపు అందుకుంది. నిర్మాతలు , దర్శకులు డిజిటల్ మీడియా పై దృష్టి సారించారు. వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉండడంతో స్టార్ హీరోయిన్స్ సమంత , కాజల్ అగర్వాల్ , తమన్నా , త్రిష , అంజలి వంటి వారు వెబ్ సిరీస్ లకు సై అంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలో తెలుగు,తమిళ , హిందీ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ ఒక హిందీ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుసమాచారం. నూతన దర్శకుడు విక్రమ్ దర్శకత్వంలో ఇద్దరి ట్విన్స్ మధ్య జరిగే కథ గా రూపొందనున్న ఈ హిందీ వెబ్ సిరీస్ అక్టోబర్ నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. తన ప్రతిభని కనపరచడానికి ఆస్కారం ఉన్న ఈ కథ నచ్చి రకుల్ ఈ వెబ్ సిరీస్ కు అంగీకారం తెలిపినట్టు సమాచారం. రకుల్ ప్రస్తుతం రెండు హిందీ , రెండు తమిళ , ఒక తెలుగు మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − twelve =