దర్శకుడు ఆర్ జి వి కి నిఖిల్ కౌంటర్

Tollywood Young Actor Nikhil Slams Ram Gopal Varma On Social Media With A Cryptic Post.

ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ మూవీస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వివాదాస్పద చిత్రాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకుల విమర్శలు అందుకుంటున్నారు. వర్మ ప్రస్తుతం “పవర్ స్టార్ ” మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇది పవర్ స్టార్ బయోపిక్ కాదు అని అనౌన్స్ చేసిన వర్మ పవన్ కళ్యాణ్ , చిరంజీవి పోలిన మనుషులతో “పవర్ స్టార్ ” మూవీ ని రూపొందిస్తున్నారు. ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ పరిస్థితి గురించి ఈ మూవీ రూపొందించినట్టుగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పై ఆర్ జి వి “పవర్ స్టార్ ” మూవీ రూపొందించడంపై అభిమానులు కోపంగా ఉన్నారు. పలువురు వర్మ పై సినిమాలు కూడా రూపొందిస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా పవన్ కళ్యాణ్ కు అభిమానులుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ అభిమాని హీరో నిఖిల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా , ఆ మహా శిఖరం తలతిప్పి చూడదని ఆర్ జి వి పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి పవన్ కళ్యాణ్ చిన్న వీడియో ను నిఖిల్ సోషల్ మీడియా లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.