లాక్ డౌన్ కి థ్యాంక్స్ – రష్మిక

Actress Rashmika Mandanna Thanks Lockdown As It Gave Her An Opportunity To Spend With Her Family Members

బ్లాక్ బస్టర్ “కిరిక్ పార్టీ ” కన్నడ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన రష్మిక నటించిన “అంజనీపుత్ర “, “చమక్ ” కన్నడ మూవీస్ విజయం సాధించాయి. బ్లాక్ బస్టర్ “ఛలో ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “గీత గోవిందం” మూవీ ఘనవిజయంతో స్టార్ హీరోయిన్ హోదా అందుకున్నారు. తరువాత రష్మిక నటించిన “యజమాన “కన్నడ మూవీ సూపర్ హిట్ అయ్యింది. “సరిలేరు నీకెవ్వరు “, “భీష్మ ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రష్మిక ప్రస్తుతం “పుష్ప “(తెలుగు ), “పొగరు ” (కన్నడ ) మూవీస్ లో నటిస్తున్నారు. “సుల్తాన్ “మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పేరెంట్స్ తో కలసి ఇంటి వద్ద హాయిగా , హ్యాపీ గా టైమ్ స్పెండ్ చేసే అవకాశం లాక్ డౌన్ వల్ల కలిగిందని , అందుకే లాక్ డౌన్ కు థ్యాంక్స్ అని రష్మిక అన్నారు. రష్మిక మాట్లాడుతూ .. లాక్ డౌన్ మొదటి వారం చిన్న బ్రేక్ దొరికిందని సంతోషించానని , లాక్ డౌన్ పొడిగించడంతో హైదరాబాద్ నుండి తన స్వంత ఊరు కూర్గ్ చేరుకున్నానని , చిన్నప్పుడు బోర్డింగ్ స్కూల్ లో చదవడంతో వేసవి సెలవులకు తప్ప మిగతా రోజులన్నీ ఇంటికి దూరంగా ఉండేదానినని, సినీ కెరీర్ ప్రారంభించాక ఎప్పుడు షూటింగ్స్ , ప్రయాణాలతో బిజీగా ఉండేదానినని , కూర్గ్ లోని తన ఇంటి కిటికీ నుండి బయటకు చూస్తే మంచు కొండలు , సువాసనలు వెదజల్లే కాఫీ తోటలు అద్భుతంగా ఉంటాయని , పేరెంట్స్ తో ఎంజాయ్ చేస్తున్నానని , ఆన్ లైన్ ద్వారా కొత్త కథలు వింటున్నానని రష్మిక చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + five =