అరుంధతి, భాగమతి, రుద్రమదేవి,దేవసేన ఈ పేర్లు వింటే చాలు మనకు గుర్తొచ్చేపేరు అనుష్క. నేటి తరం నాయకులకు లేడీ ఒరిఎంటేడ్ సినిమాలు తీయడానికి ఒక రకంగా అనుష్కనే స్పూర్తి. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనుష్క. మొన్ననే ఈ సినిమా 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా.. పూరీ జగన్నాథ్ తన ట్విట్టర్‌లో.. అనుష్కపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసాడు. “ఆ అమ్మాయిని చూడగానే చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పారు నాగార్జున గారు. మా అనుష్క మొదటి సినిమా సూపర్ రిలీజ్ అయిన రోజు. సూపర్ నుండి నిశ్శబ్దం వరకు ఎన్నో మెట్లు ఎక్కి ఈ స్థాయిలో ఉన్న అనుష్కని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని.. నిశ్శబ్ధంతో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తావని ఆశిస్తున్నాను అని ట్వీట్ లో పేర్కొన్నాడు పూరీ”.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఇటీవలే అనుష్క 15ఏళ్ల సినీ ప్రస్థాన వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఎస్ఎస్ రాజమౌళి, పూరీ జగన్నాధ్, పలువురు దర్శకులు, అనుష్కతో పనిచేసిన కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఆమె నట ప్రస్థానంపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఆ అమ్మాయిని చూడగానే చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పారు నాగార్జున గారు @iamnagarjuna మా అనుష్క మొదటి సినిమా సూపర్ రిలీజ్ అయిన రోజు. సూపర్ నుండి నిశ్శబ్దం వరకు ఎన్నో మెట్లు ఎక్కి ఈ స్థాయిలో ఉన్న అనుష్కని చుస్తే ఐ feel proud . You will rock more with #nishabdam @hemantmadhukar pic.twitter.com/B42Sqj3BhN
— PURIJAGAN (@purijagan) July 22, 2020
ప్రస్తుతం అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్దం’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈసినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































