కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 128

సినిమా వార్తలు

'మ‌హాస‌ముద్రం'లో అను ఇమ్మాన్యుయేల్‌

అజయ్ భూపతి దర్శకత్వంలో విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్న హీరో శ‌ర్వానంద్‌, ప్ర‌తిభావంతుడైన న‌టుడిగా పేరు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'మ‌హాస‌ముద్రం'. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్ట్రెస్‌ అదితి రావ్ హైద‌రిని ఎంపిక చేసినట్టు ఇటీవలే ప్రకటించగా.. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అందాల తార అను ఇమ్మాన్యుయేల్‌ను మ‌రో హీరోయిన్ రోల్ కోసం ఎంపిక చేశారు. ఆమెది కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రగా తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తెలుగు అమ్మాయి గా రాశీఖన్నా

అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రాశీఖన్నా తెలుగు మూవీస్ తో పాటు తమిళ మూవీస్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ , గిటార్ , తమిళ భాషను నేర్చుకుంటూ , వర్కౌట్స్ తో రాశీఖన్నా లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేశారు. ప్రస్తుతం రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్న రాశీఖన్నా ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

రవితేజ 'ఖిలాడి' ఫస్ట్ లుక్ రిలీజ్

రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను హైద్రాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఈ సినిమాకు ఖిలాడి అనే టైటిల్ ను పెట్టనున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘ఖిలాడి’ (ప్లే స్మార్ట్‌) అనే టైటిల్ ను పెట్టారు. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్‌లుక్‌లో రవితేజ హుషారుగా కనిపిస్తుండగా, అతడిపై కరెన్సీ నోట్ల వర్షం కురుస్తుండటం ఆసక్తిని పంచుతోంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ప్రీ టీజర్ రిలీజ్

అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ అవ్వగా దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి పలు పోస్టర్స్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. వాటితో పాటు సిద్ద్‌ శ్రీరామ్ పాడిన మనసా పాట కూడా బాగా ఆకట్టుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా ప్రీ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డాక్టర్స్‌కు థ్యాంక్స్ - మీ వల్లే త్వరగా బయటపడ్డాను

మిల్కీబ్యూటీ తమన్నా ఇటీవలే కోవిడ్‌ బారి నుండి బయట పడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఓ షూటింగ్‌ కోసం వచ్చిన తమన్నాకు కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంది. ఇప్పుడు తగ్గిపోయిందనుకోండి. కరోనా తగ్గిపోవడంతో తిరిగి తన హోమ్ టౌన్ ముంబై కూడా తిరిగి వెళ్ళిపోయింది తమన్నా. అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ స‌భ్యుల ప్రార్థ‌న‌ల‌తోనే నేను త్వ‌ర‌గా వ‌చ్చానని కూడా తెలిపింది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

రవితేజ 67 సినిమా ఫస్ట్‌లుక్‌ అప్‌డేట్

'రాక్షసుడు' ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను ప్రకటించారు కూడా. ఏ స్టూడియోస్ పతాకంపై హవీష్ ప్రొడక్షన్‌లో ప్ర‌ముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

తమన్నా లేటెస్ట్ వర్కౌట్

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తమన్నా అభిమానులను అలరిస్తున్నారు. తమన్నా తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో స్పెషల్ సాంగ్స్ లో నటించి ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఎటువంటి పాత్రలోనైనా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమన్నా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. 6 నెలల తరువాత షూటింగ్ లో పాల్గొని తమన్నా కరోనా బారిన పడ్డారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'రాధే శ్యామ్' - మోషన్ పోస్టర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

ఒకప్పుడు ప్రభాస్ సినిమా నుండి ఏదైనా అప్ డేట్ రావాలంటే ఎంతో కాలం ఎదురుచూడాల్సి వచ్చేది. ఈ మధ్య ఏంటో అడగక ముందే అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అసలు సంగతేంటంటే ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ టీమ్ ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటీవలే పూజా హెగ్డే పుట్టినరోజు కావడంతో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో ప్రేరణ అనే పాత్రలో నటిస్తుంది పూజా.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నిఖిల్ న్యూ లుక్

సూపర్ హిట్ "హ్యాపీ డేస్ " మూవీ తో లీడ్ రోల్ లో టాలీవుడ్ కు పరిచయం అయిన నిఖిల్ "స్వామి రారా ", "కార్తికేయ ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా ", "అర్జున్ సురవరం "వంటి సూపర్ హిట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. అఖిల్ ప్రస్తుతం "కార్తికేయ "మూవీ సీక్వెల్ "కార్తికేయ 2 ", "18 పేజెస్ "మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిఖిల్ హీరోగా మరికొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నవంబన్ నుండి వెంకీ కూడా రెడీ

దాదాపు టాలీవుడ్ హీరోలందరూ షూటింగ్ లను మొదలు పెట్టేసారు. యంగ్ హీరోలు అయితే చాలా మంది షూట్ ను మొదలుపెట్టేసారు. కొంతమంది అయితే షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇక అగ్ర హీరోల్లో ముందు నాగార్జున షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు షూటింగ్ కోసం విదేశాలకు కూడా వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు మరో అగ్ర హీరో కూడా షూట్ కు రెడీ అయిపోయాడు. ఆ హీరో ఎవరో కాదు వెంకీ.

TFN Adminవాట్సాప్
సాంగ్

మాస్ మహారాజ్ తో వర్మ హీరోయిన్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ లాక్ డౌన్ ముందే ముగింపు దశకు వచ్చింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వరల్డ్ ఫుడ్‌ డే.. ఏం తింటున్నారో దాన్ని ప్రేమించండి

ఆర్గానిక్ ఫుడ్ తినాలని.. మనకు కావాల్సిన కాయగూరలు ఇంట్లోనే పండించుకొని తినమని ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత కూడా అదే చెపుతుంది. అసలు సంగతేంటంటే ఈరోజు వరల్డ్ ఫుడ్‌ డే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నమ్రతా శిరోద్కర్‌ ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

హైదరాబాద్ లో యాక్షన్ స్టార్ యశ్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా కోలార్ గోల్డ్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ కన్నడ మూవీ "కె జి ఎఫ్ చాప్టర్1 " ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీ నిధి శెట్టి హీరోయిన్ కాగా స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించారు. హీరో యశ్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీ కి హై లైట్ గా నిలిచింది. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ విజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బెంగళూరులో తెలుగు మూవీస్ హంగామా

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్స్ బంద్ అయిన విషయం తెలిసిందే. సుమారు 6 నెలల తరువాత మూవీ షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 15 వ తేదీ నుండి థియేటర్స్ ప్రారంభానికై కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యం లో బెంగళూరు లో కొన్ని థియేటర్స్ అయ్యాయి. సంక్రాంతి పండగకు రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన మహేష్ బాబు "సరిలేరు నీకెవ్వరు ", అల్లు అర్జున్ "అల .. వైకుంఠపురములో .. "నితిన్ "భీష్మ " మూవీస్ బెంగళూరు థియేటర్స్ లో రీ రిలీజ్ అయ్యాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సొంత బ్యానర్‌లో నాలుగో సినిమా

ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు నాగశౌర్య. ఇప్పటికే ఐరా క్రియేషన్స్‌ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి ఆ బ్యానర్ లోనే ఛలో, నర్తనశాల, అశ్వథ్థామ చిత్రాలను నిర్మించాడు. ఇప్పుడు మరో సినిమాను తన బ్యానర్ లో చేయడానికి రెడీ అయ్యాడు నాగశౌర్య. అంతేకాదు తన బ్యానర్‌లో చేయబోతున్న నాలుగో సినిమాను ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు కూడా.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మరో మూవీ కి ఇలియానా గ్రీన్ సిగ్నల్

బ్లాక్ బస్టర్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియానా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో రాణించారు. టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉండగానే ఇలియానా సూపర్ హిట్ "బర్ఫీ " మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ఇలియానా బాలీవుడ్ లో బిజీగా మారారు. ఇలియానా ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ హీరోగా రూపొందుతున్న "ది బిగ్ బుల్ " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరో బాలీవుడ్ మూవీలో పూజాహెగ్డే

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం "రాధేశ్యామ్ ", మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీస్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ లో పూజాహెగ్డే నటించిన "హౌస్ ఫుల్ 4" మూవీ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటున్నారు. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందనున్న "కభీ ఈద్ కభీ దివాలీ " మూవీ కథానాయికగా ఎంపిక అయిన పూజాహెగ్డే మరో బాలీవుడ్ మూవీ కి కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అధీరా లుక్‌లోకి సంజ‌య్

తాను చేస్తున్న వృత్తి పట్ల తనకు ఎంత డెడికేషన్, ప్యాషన్ ఉందో అర్ధమవుతుంది బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను చూస్తుంటే. ఎందుకంటే ప్రస్తుతం సంజయ్ దత్ కు ఆరోగ్యం బాలేదన్న సంగతి తెలిసిందే. ఇటీవలే లంగ్‌ క్యాన్సర్‌ అని తెలియగా దానికి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. మరి క్యాన్సర్ ట్రీట్ మెంట్ అంటే చాలా మందికి తెలిసిందే ఎంత వీక్ అయిపోతారో. ఇటీవల సోషల్ మీడియాలో సంజయ్ లుక్ చూసి కూడా చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. ఆయన సన్నగా, క‌ళ్లు లోప‌లికి పోయి, నీరసంగా కనిపించడంతో అందరూ షాకయ్యారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'అన్న‌పూర్ణ స్టూడియోస్' పై వార్తలు నమ్మొద్దు

అన్న‌పూర్ణ స్టూడియోలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకున్నట్టు ఈ రోజు ఉదయం నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కోసం వేసిన సెట్‌లో షార్ట్ స‌ర్క్యూట్ జ‌ర‌గ‌డంతో ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్టు తెలుస్తుంది. అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే స్పందించి సంఘ‌ట‌నా స్థలానికి చేరుకొని మంట‌ల్ని ఆర్పివేయ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ న‌ష్టం ఏమి జ‌ర‌గకపోగా, ఆస్తి న‌ష్టం కూడా పెద్ద‌గా జ‌ర‌గ‌లేదు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

నితిన్ 'చెక్' మొదలైంది

సినిమా రిలీజ్ లు విషయం పక్కనపెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు నితిన్. ప్రస్తుతం నితిన్ ‌రంగ్ దే సినిమా షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముంగింపు దశకు రాగానే మరో సినిమాను లైన్ లో పెట్టేసాడు. నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా... ఇటీవల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా `చెక్` యూనిట్ ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్

షేర్