‘అన్న‌పూర్ణ స్టూడియోస్’ పై వార్తలు నమ్మొద్దు

Nagarjuna Akkineni Asks everyone not to believe in the rumours related to fire accident at Annapurna studios

అన్న‌పూర్ణ స్టూడియోలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకున్నట్టు ఈ రోజు ఉదయం నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కోసం వేసిన సెట్‌లో షార్ట్ స‌ర్క్యూట్ జ‌ర‌గ‌డంతో ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్టు తెలుస్తుంది. అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే స్పందించి సంఘ‌ట‌నా స్థలానికి చేరుకొని మంట‌ల్ని ఆర్పివేయ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ న‌ష్టం ఏమి జ‌ర‌గకపోగా, ఆస్తి న‌ష్టం కూడా పెద్ద‌గా జ‌ర‌గ‌లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ ప్రమాదంపై పలు వదంతులు రావడంతో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా వదంతులు నమ్మొద్దని క్లారిటీ ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో అంతా బాగానే ఉంది. మేం ధృవీక‌రించని వార్తలు ఎవరు నమ్మొద్దని ట్వీట్ చేశారు.

 

కాగా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు త‌న భార్య పేరుతో అన్న‌పూర్ణ స్డూడియో ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ళ నుండి ఈ స్టూడియోస్ ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాల‌ను నిర్మించారు. సినిమాల‌తో పాటు సీరియ‌ల్స్, రియాలిటీ షోస్ ఇలా ఎన్నో ఈ స్టూడియోలో జ‌రుగుతుంటాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.