సినిమా రిలీజ్ లు విషయం పక్కనపెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు నితిన్. ప్రస్తుతం నితిన్ రంగ్ దే సినిమా షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముంగింపు దశకు రాగానే మరో సినిమాను లైన్ లో పెట్టేసాడు. నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా… ఇటీవల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా `చెక్` యూనిట్ ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా మరో షెడ్యూల్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఈ విషయాన్ని నితిన్ ట్విటర్ ద్వారా తెలియజేశాడు. కాగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
New schedule beginsss!! 😎😎 @yeletics @BhavyaCreations @Rakulpreet #priyavarrier pic.twitter.com/nPQnGcowdW
— nithiin (@actor_nithiin) October 16, 2020
మరి ఐతే, అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం, మనమంతా..వంటి చిత్రాలతో డైరెక్టర్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు చంద్రశేఖర్ యేలేటి. మరి నితిన్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో చూద్దాం. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాకే అంధాధున్ తెలుగు రీమేక్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు నితిన్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































