‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను ప్రకటించారు కూడా. ఏ స్టూడియోస్ పతాకంపై హవీష్ ప్రొడక్షన్‌లో ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. అదేంటంటే…ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటల 55 నిమిషాలకు ఫస్ట్‌లుక్ వివరాలను తెలియజేస్తామని చిత్రయూనిట్ ప్రకటించారు. కాగా గతంలో రవితేజ, రమేశ్ వర్మ కాంబినేషన్‌లో వీర సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేకపోయింది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దాం.
Yet another interesting & entertaining one lined up😎 pic.twitter.com/pd6bnJusR6
— Ravi Teja (@RaviTeja_offl) October 17, 2020
కాగా ప్రస్తుతం రవితేజ క్రాక్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి.మధు నిర్మిస్తున్నారు. శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం రవితేజ, అప్సరారాణిలపై ప్రత్యేకగీతాన్ని చిత్రీకరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: