ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 129
హీరో బాలయ్య కు జోడీ గా మలయాళీ భామ ?
రమేష్ వర్మ సినిమాలో రవితేజకు జోడీగా..?
'ఆద్య' తో వస్తున్న రేణు
నవ సిద్ధుల గుట్టలో "లవ్ స్టోరీ "
వికారాబాద్ అడవుల్లో "విరాటపర్వం "
తమ్ముడికి అభినందనలు - మరో విన్నపం
కె.జి.ఎఫ్2 - నవంబర్ నుండి షూట్ లో సంజయ్ దత్..!
రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ ?
దసరాకు "వకీల్ సాబ్ "మూవీ ట్రీట్ ?
బాబాయ్ నేను రెడీ.. నువ్వు రెడీయా..!
ఏజెంట్ క్లారిటీ .. 'కొరటాల శివ' తో చెయ్యట్లేదు
సమంత లాక్ డౌన్ ఎక్స్ పీరియన్స్
సాయి తేజ్ కు చిరంజీవి బర్త్ డే శుభాకాంక్షలు

తలైవి కోసం 20కిలోలు పెరిగా

F2 సీక్వెల్ లో సునీల్..?
గుణశేఖర్ "శకుంతలమ్ "మూవీ విశేషాలు
'మోసగాళ్ళు' తో చేయి కలిపిన వెంకీ
హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
హీరో బాలయ్య కు జోడీ గా మలయాళీ భామ ?
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ "BB3 "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. #NBK106 మూవీ గా రూపొందుతున్న "BB3 "లో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ పాత్రలలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హీరో బాలకృష్ణ నటించే అఘోరా పాత్ర ఈ మూవీ కి హైలైట్ కానుంది. కరోనా కారణంగా నిలిచిపోయిన"BB3 "మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది.
బిగ్ బాస్ 4 ఎమోషన్ తో నిండిపోయిన హౌస్
బిగ్ బాస్ 4- నిజానికి వారంలో మూడు రోజులు అంటే సోమవారం నామినేషన్స్.. ఇంకా మూడు రోజులు కెప్టెన్సీ టాస్క్ అంటూ బిజీగా వుండే హౌస్ మేట్స్ గురువారం.. శుక్రవారం మాత్రం కొంచం ఖాళీగానే ఉంటారు. ఇక వీకెండ్స్ శనివారం.. ఆదివారం అంటే నాగార్జున వస్తాడు.. ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా ఉంటది. ప్రతి వారం లాగే ఈ గురువారం కూడా కొంచం చప్పగానే సాగింది. హౌస్ మొత్తం ఎమోషన్ తో నిండిపోయింది.
రమేష్ వర్మ సినిమాలో రవితేజకు జోడీగా..?
మాస్ మహా రాజా రవితేజ హిట్, ప్లాప్ తో పనిలేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే డిస్కో రాజా సినిమాతో అలరించిన రవితేజ ప్రస్తుతం 'క్రాక్' సినిమాతో బిజీగా ఉన్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి దశకు వచ్చేసింది. ఒక పదిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది. ఇక ఈ సినిమా చేస్తూనే మరో రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.
'ఆద్య' తో వస్తున్న రేణు
చాలా ఏళ్ళ తర్వాత రేణు మళ్ళీ కెమెరా ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు తెలిపింది రేణు. ఈ వెబ్ సిరీస్‌కు నిర్మాతలు డిఎస్. రావు, ఎస్. రజినీకాంత్. సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎమ్.ఆర్. కృష్ణ మామిడాల. సినిమాటోగ్రఫీ దాశరథి శివేంద్ర అందిస్తున్నాడు.
నవ సిద్ధుల గుట్టలో "లవ్ స్టోరీ "
వైవిధ్య భరిత కథా చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రావు రమేష్ , పోసాని , దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సి హెచ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "లవ్ స్టోరీ " మూవీ లో నాగచై తన్య , సాయి పల్లవి తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడడం విశేషం.
వికారాబాద్ అడవుల్లో "విరాటపర్వం "
సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ "మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో వాస్తవ సంఘటనల ఆధారంగా "విరాటపర్వం " మూవీ రూపొందుతుంది. రానా , సాయి పల్లవి ఉద్యమకారులుగా నటిస్తున్న ఈ మూవీ లో ప్రియమణి , నందిత దాస్ , నవీన్ చంద్ర , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కరోనా కారణంగా "విరాటపర్వం " మూవీ షూటింగ్ నిలిచిపోయింది.
తమ్ముడికి అభినందనలు - మరో విన్నపం
సేవా కార్యక్రమాలు చేయడంలో మెగా స్టార్ చిరంజీవి ఎప్పుడు ముందుంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు అందరినీ చేయమని కూడా చెపుతుంటారు. ఇప్పటికే కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు తన ఛారిటీ ద్వారా సాయం అందిస్తున్నాడు. అలాగే తన బ్లడ్ బ్యాంకు ద్వారా ప్లాస్మా దానం చెయ్యాలి అని పిలుపును కూడా ఇచ్చారు. ఇప్పుడు చిరు మరోసారి పిలుపునిస్తున్నారు.
కె.జి.ఎఫ్2 - నవంబర్ నుండి షూట్ లో సంజయ్ దత్..!
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ గత కొద్దికాలంగా క్యాన్సర్ కు చికిత్స చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అటు ట్రీట్ మెంట్ తీసుకుంటూనే మరో వైపు షూటింగ్ లకు కూడా హాజరవుతూ దర్శక నిర్మాతలకు అందుబాటులో ఉంటున్నాడు. ప్రస్తుతం శంషెరా చిత్రానికి డబ్బింగ్ చెప్పే పనిలో వున్నాడు. ఇక హిందీలో పలు సినిమాల్లో నటిస్తుండగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న కె.జి.ఎఫ్2 లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అధీరా అనే ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు.
రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ ?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత హీరో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ కై పలు మూవీస్ వెయిటింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా మూవీస్ లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ ఒక పాన్ ఇండియా మూవీ లో నటించనున్నారని సమాచారం.
దసరాకు "వకీల్ సాబ్ "మూవీ ట్రీట్ ?
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ ఫిలిమ్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అంజలి , నివేద థామస్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. 6 నెలల తరువాత "వకీల్ సాబ్ "మూవీ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. దాదాపుగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న "వకీల్ సాబ్ "మూవీ లో పవన్ కళ్యాణ్ వర్క్ కొంత బ్యాలెన్స్ ఉన్నట్టు సమాచారం.
బాబాయ్ నేను రెడీ.. నువ్వు రెడీయా..!
మెగా హీరో సాయితేజ్ నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినిమా ప్రముఖుల నుండి పుట్టిన రోజులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కూడా సాయి తేజ్ కు తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే బాయ్ కు విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్ డే బాబాయ్.. యాదృచ్చికంగా బ్లాక్ బస్టర్ 'బిల్లా రంగా' సినిమా కూడా నేటితో 38 ఏళ్ళు పూర్తి చేసుకుంది.. . ఇది మనకు ఏదో చెబుతోంది అనుకుంటున్నా బాబాయ్. నేను రెడీ.. నువ్వు రెడీయా` అని సాయితేజ్ ఫొటో, `బిల్లా రంగా` సినిమా పోస్టర్‌ను మనోజ్ ట్వీట్ చేశాడు. మరి దీనిపై సాయి తేజ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా మంచు మనోజ్, సాయితేజ్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే.
ఏజెంట్ క్లారిటీ .. 'కొరటాల శివ' తో చెయ్యట్లేదు
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో హీరోగా గుర్తింపు తెచుకున్నాడు. బాలీవుడ్ సినిమా చిచోరేలో కనిపించాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా కనిపించిన ఈ సినిమాలో నవీన్, తనదైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తెలుగులో నవీన్ పోలిశెట్టి తన రెండవ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి బ్లాక్ బస్టర్ మహానటి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా స్వప్న సినిమాస్ బ్యానర్ పై అనుదీప్ దర్శకత్వం లో జాతి రత్నాలు అనే కామెడీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
సమంత లాక్ డౌన్ ఎక్స్ పీరియన్స్
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుంటున్న సమంత ఇప్పుడు దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న హారర్ థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
సాయి తేజ్ కు చిరంజీవి బర్త్ డే శుభాకాంక్షలు
ఈ రోజు హీరో సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖుల , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుబ్బు దర్శ కత్వంలో సాయి తేజ్ , నభా నటేష్ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్"సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో సాయి తేజ్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది.

త్వరగానే కోలుకున్నా - త్వరగా ఇంటికి తిరిగి వస్తా అనుకోలేదు
మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత దాదాపు ఏడు నెలల విరామం తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టింది తమన్నా. ఇక్కడికి వచ్చిన దగ్గరనుండి ఆమె ఓ వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కరోనా సోకడంతో ఇన్ని రోజులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లోనే చికిత్స తీసుకుంది. ఇక ఇప్పుడు కరోనా తగ్గిపోవడంతో తిరిగి తన హోమ్ టౌన్ ముంబై తిరిగి వెళ్ళిపోయింది.

తలైవి కోసం 20కిలోలు పెరిగా
ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కరోనా వల్ల షూటింగ్ కు కాస్త బ్రేక్ రాగా రీసెంట్ గానే తిరిగి షూటింగ్ ను ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో జయలలిత బాల్యం నుండి సీఎం అయ్యేవరకూ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది లాంటి అన్ని విషయాలను చూపించనున్నారు.

బిగ్ బాస్ 4 - రెండోసారి కెప్టెన్ అయిన నోయల్
బిగ్ బాస్ 4.. మంగళవారం మొదలైన కెప్టెన్సీ టాస్క్ నిన్న కూడా కొనసాగింది. మొన్నటి కంటే నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంకా కష్టమైన టాస్క్ లు ఇచ్చాడని చెప్పొచ్చు. ఇక నిన్న ఎపిసోడ్ లో ఏడో డీల్ గా తల, గడ్డం సగం గీసుకోవాలి. అయితే ఈ టాస్క్ మాత్రం రెండు టీమ్స్ చేయమని చెప్పేసరికి బిగ్ బాస్ కూడా క్యాన్సిల్ చేసాడు. ఎనిమిదో డీల్ గా పేడ కలిగిన బాత్‌టబ్‌లో దిగాలి. అఖిల్ గంట మోగించడంతో అతని టీమ్‌లో దివి ఈ టాస్క్ చేసేందుకు ముందుకు వచ్చింది. తొమ్మిదో డీల్ గా ముఖానికి స్టాకింగ్ వేసుకుని దానిపై నుంచి అరటి పళ్లను తినాలి. అరియానా గంట మోగించడంతో అభిజిత్ ఈ చాలెంజ్ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు…

F2 సీక్వెల్ లో సునీల్..?
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్లో నవ్వులు పూయించాడో తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే.
గుణశేఖర్ "శకుంతలమ్ "మూవీ విశేషాలు
"లాఠీ " మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన గుణశేఖర్ "సొగసు చూడతరమా " మూవీ తో విజయం సాధించారు. గుణశేఖర్ దర్శకత్వంలో బాల నటీ నటులతో రూపొందిన "రామాయణం "మూవీ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన "చూడాలని ఉంది ", "ఒక్కడు ", "రుద్రమదేవి " వంటి మూవీస్ ఘనవిజయం సాధించాయి. "ఒక్కడు "మూవీ కి బెస్ట్ డైరెక్టర్ గా గుణశేఖర్ నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. 5 సంవత్సరాల తరువాత గుణశేఖర్ తన కొత్త మూవీ ని అనౌన్స్ చేశారు.