‘రాధే శ్యామ్’ – మోషన్ పోస్టర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

Muhurtham Fixed For Radhe Shyam Movie Motion Poster Release

ఒకప్పుడు ప్రభాస్ సినిమా నుండి ఏదైనా అప్ డేట్ రావాలంటే ఎంతో కాలం ఎదురుచూడాల్సి వచ్చేది. ఈ మధ్య ఏంటో అడగక ముందే అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అసలు సంగతేంటంటే ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ టీమ్ ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటీవలే పూజా హెగ్డే పుట్టినరోజు కావడంతో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో ప్రేరణ అనే పాత్రలో నటిస్తుంది పూజా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈనెల 23న ప్రభాస్ పుట్టిన రోజు అన్న సంగతి అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఆ రోజు కూడా ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేసారు చిత్ర యూనిట్. ఇప్పటివరకూ టైటిల్ పోస్టర్ ను, పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పుడు మొదటిసారి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఈ సినిమాను నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.

 

కాగా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ మరియు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + eight =