గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ లాక్ డౌన్ ముందే ముగింపు దశకు వచ్చింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఐటంసాంగ్ ను కూడా పెట్టాడు డైరెక్టర్. ఇక ఈసాంగ్ లో రాంగోపాల్ వర్మ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకులను ఆడియెన్స్ ను అలరించిన అప్సరా రాణి ఐటెంసాంగ్ లో కనిపించనుంది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సెట్ లో దిగిన ఒక ఫొటోను గోపీచంద్ మలినేని ట్విటర్ లో షేర్ చేశాడు. మాస్ రాజా రవితేజ, జానీ మాస్టర్, అప్సరా రాణి కాంబోలో ప్రేక్షకుల్లో జోష్ నింపేందుకు మాస్ సాంగ్ రాబోతుంది అని చెప్పాడు గోపీచంద్. రవి తేజ, జానీ, గోపీచంద్ బ్లాక్ డ్రెస్సుల్లో ఉండగా అప్సరా రాణి స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకుంటుంది.
#KRACK mass item song loading 🔥🔥🔥🔥 #Apsara Rani pic.twitter.com/6ZBdXXMJTZ
— Gopichandh Malineni (@megopichand) October 16, 2020
కాగా ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ సినిమాతో శ్రుతి హాసన్ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను… సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: