హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా కోలార్ గోల్డ్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ కన్నడ మూవీ “కె జి ఎఫ్ చాప్టర్1 ” ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీ నిధి శెట్టి హీరోయిన్ కాగా స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించారు. హీరో యశ్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీ కి హై లైట్ గా నిలిచింది. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ విజయం సాధించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




“కె జి ఎఫ్ చాప్టర్1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్2 ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “కె జి ఎఫ్ చాప్టర్2 ” మూవీ షూటింగ్ షెడ్యూల్ కొన్ని రోజుల క్రితం బెంగళూరు లో కంప్లీట్ అయ్యింది. హైదరాబాద్ లో జరిగే షూటింగ్ షెడ్యూల్ కై దర్శకుడు ప్రశాంత్ నీల్ హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పుడు హీరో యశ్ కూడా
హైదరాబాద్ కు చేరుకున్నారు. స్టైలిష్ లుక్ తో, మాస్క్ తో , పెద్ద నల్ల కళ్ళద్దాలతో గుర్తుపట్టని విధంగా ఉన్న హీరో యశ్ ను అభిమానులు , మరికొంతమంది గుర్తుపట్టారు. పాన్ ఇండియా స్టార్ గా మారిన యశ్ నటించే “కె జి ఎఫ్ చాప్టర్2 ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: