అజయ్ భూపతి దర్శకత్వంలో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరో శర్వానంద్, ప్రతిభావంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘మహాసముద్రం’. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్ట్రెస్ అదితి రావ్ హైదరిని ఎంపిక చేసినట్టు ఇటీవలే ప్రకటించగా.. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అందాల తార అను ఇమ్మాన్యుయేల్‌ను మరో హీరోయిన్ రోల్ కోసం ఎంపిక చేశారు. ఆమెది కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రగా తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ ను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది. ‘మహాసముద్రం’లో నటించే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
మరి అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత సన్సేషన్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి చిత్రం ఆర్ఎక్స్ 100 సినిమాతోనే పెద్ద సక్సెస్ కొట్టాడు అరుణ్ భూపతి. మరి ఈ సినిమా ఎంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: