తాను చేస్తున్న వృత్తి పట్ల తనకు ఎంత డెడికేషన్, ప్యాషన్ ఉందో అర్ధమవుతుంది బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను చూస్తుంటే. ఎందుకంటే ప్రస్తుతం సంజయ్ దత్ కు ఆరోగ్యం బాలేదన్న సంగతి తెలిసిందే. ఇటీవలే లంగ్ క్యాన్సర్ అని తెలియగా దానికి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. మరి క్యాన్సర్ ట్రీట్ మెంట్ అంటే చాలా మందికి తెలిసిందే ఎంత వీక్ అయిపోతారో. ఇటీవల సోషల్ మీడియాలో సంజయ్ లుక్ చూసి కూడా చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. ఆయన సన్నగా, కళ్లు లోపలికి పోయి, నీరసంగా కనిపించడంతో అందరూ షాకయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు మళ్లీ ఆయన నార్మల్ లుక్ లోకి వచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు.తాజాగా తన ట్విట్టర్ ద్వారా ఈ రోజు ఆయన తనకు సంబంధించిన మూడు ఫొటోలను పోస్ట్ చేసాడు. ఇందులో పూర్తిగా పాత సంజయ్ దత్‌లా మారిపోయినట్టు కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో అధీరా పాత్ర కోసం సిద్ధం అవుతున్నానని ఆయన ట్వీట్ చేసారు.
Gearing up for #Adheera!⚔️ #KGFChapter2 pic.twitter.com/Yd2FHSUUYn
— Sanjay Dutt (@duttsanjay) October 16, 2020
కాగా నవంబర్ నుండి సంజయ్ దత్ ‘కేజీయఫ్ 2’ షూటింగ్ లో అడుగుపెడతారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దాదాపు నెల రోజుల పాటు ఆయన పాత్రకి సంబంధించిన షూటింగ్ ఉండనుంది. సంజయ్ దత్ షూటింగ్ అయిపోతే దాదాపు సినిమా షూటింగ్ అయిపోయినట్టే అంటున్నారు చిత్రయూనిట్. మరి ఒకపక్క ట్రీట్ మెంట్ తీసుకుంటూనే సంజయ్ మరో పక్క సినిమాల్లో నటించడం అంటే నిజంగా గొప్ప విషయమే కదా.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న కె.జి.ఎఫ్2 లో యష్ హీరోగా నటిస్తుండగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది… సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్లతో పాటు తెలుగు నటుడు రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























