రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను హైద్రాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఈ సినిమాకు ఖిలాడి అనే టైటిల్ ను పెట్టనున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘ఖిలాడి’ (ప్లే స్మార్ట్) అనే టైటిల్ ను పెట్టారు. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్‌లుక్‌లో రవితేజ హుషారుగా కనిపిస్తుండగా, అతడిపై కరెన్సీ నోట్ల వర్షం కురుస్తుండటం ఆసక్తిని పంచుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ను నవంబర్‌లో మొదలుపెట్టనున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలను హీరోయిన్లుగా ఎంపిక చేసినట్టు సమాచారం. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతీలాల్ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రఫీ సుజిత్ వాసుదేవ్ అందిస్తున్నాడు.
Unveiling the first look of #Khiladi😎
All set for another exciting journey!@DirRameshVarma #KoneruSatyanarayana #AStudiosLLP @PenMovies pic.twitter.com/PNoBgLkfhg— Ravi Teja (@RaviTeja_offl) October 18, 2020
కాగా ప్రస్తుతం రవితేజ క్రాక్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి.మధు నిర్మిస్తున్నారు. శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం రవితేజ, అప్సరారాణిలపై ప్రత్యేకగీతాన్ని చిత్రీకరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: