మరో మూవీ కి ఇలియానా గ్రీన్ సిగ్నల్

Actress Ileana Gives Green Signal To Another Bollywood Movie

బ్లాక్ బస్టర్ “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియానా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో రాణించారు. టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉండగానే ఇలియానా సూపర్ హిట్ “బర్ఫీ ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ఇలియానా బాలీవుడ్ లో బిజీగా మారారు. ఇలియానా ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ హీరోగా రూపొందుతున్న “ది బిగ్ బుల్ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోనీ పిక్చర్స్ , టన్నెల్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై బల్విందర్ జనువా దర్శకత్వంలో రణదీప్ హుడా హీరోగా “అన్ ఫెయిర్ &లవ్లీ” హిందీ మూవీ రూపొందనుంది. వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడే యువతి నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీ లో ఇలియానా కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఇలియానా మాట్లాడుతూ .. రణదీప్ హుడా కు జోడీగా నటిస్తున్నందుకు థ్రిల్లింగ్ గా ఉందనీ , “అన్ ఫెయిర్ &లవ్లీ” మూవీ స్క్రిప్ట్ తనకు బాగా నచ్చిందనీ , సందేశం ఇస్తున్నట్టుగా కాకుండా వినోదాత్మకంగా విషయాన్ని తెలిజేసేలా ఈ మూవీ కామెడీ గా ఉంటుందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.