ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 127
కామెడీ ఎంటర్ టైనర్ "ఛలో "
ఇకపై నా సినిమాను నేనే నిర్మించుకుంటా..!
ఫ్రెండ్స్ ను సర్ప్రైజ్ చేయండి
న్యూ క్యారెక్టర్ లో నిఖిల్
‘తిమ్మరుసు’ అఫీషియల్ గా లాంచ్

USA & జపాన్ లలో "బాహుబలి 2 ", "సాహో " రీ రిలీజ్
'ఆర్ఆర్ఆర్' - భీం టీజర్ కు ముహూర్తం ఫిక్స్
ఆ ఘనత మనవాళ్లదే ..!
షూటింగ్ లో జాయిన్ అయిన రకుల్ ప్రీత్
నిఖిల్ '18 పేజెస్' షూటింగ్ మొదలు
భూమి పెడ్నేకర్ టాలీవుడ్ ఎంట్రీ ?
వర్క్ మోడ్ లో తాప్సీ
రష్మిక ఇన్ స్టాగ్రామ్ రికార్డ్
'స్టార్ ప్రొడ్యూసర్' కు 'సూపర్ స్టార్' విషెస్
భారీ వర్షాలపై విజయ్ దేవరకొండ స్పందన

అనుపమకు "18 పేజెస్ " స్వాగతం
బిగ్ బాస్ 4- బీభత్సం చేసిన రాక్షసులు
బిగ్ బాస్ 4 - 7వ వారంలో లగ్జరీ బడ్జెట్ టాస్కు ఇచ్చేసాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా "కొంటె రాక్షసుడు- మంచి మనుషులు" అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో బిగ్‌బాస్‌పురం రాజ్యంలో అరియానా, అవినాష్, అఖిల్, మెహబూబ్, హారిక కొంటె రాక్షసుల టీమ్‌లో ఉండగా, నోయల్, అభిజిత్, లాస్య, అమ్మ రాజశేఖర్, మోనాల్, దివి, సోహెల్ మంచి మనుషులు టీమ్ లో ఉన్నారు. ఇక టాస్క్ లో ఒక్కో రాక్షసుడిని మంచి మనిషిగా మార్చిన ప్రతీసారి రావణుడి బొమ్మలోని పది తలల్లో రెండింటిని పగలగొట్టాల్సి ఉంటుంది. అందుకు బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తాడు. టాస్క్ ను పూర్తి చేసిన ప్రతిసారీ రెండు తలలను పగల గొట్టాలి. అలా ముగ్గురు రాక్షసులను…
కామెడీ ఎంటర్ టైనర్ "ఛలో "
ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య , రష్మిక జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "ఛలో " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నరేష్ , రఘు బాబు , వెన్నెల కిషోర్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. "ఛలో " మూవీతో వెంకీ కుడుముల దర్శకుడిగా , రష్మిక హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.
ఇకపై నా సినిమాను నేనే నిర్మించుకుంటా..!
అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి వంగా తెలుగులో ఎన్ని సంచలనాలు సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇక్కడ అర్జున్ రెడ్డి సినిమాతో హిట్ కొట్టి ఏకంగా బాలీవుడ్ లో డైరెక్ట్ చేసే అవకాశాన్ని కొట్టేసాడు సందీప్ వంగా. సందీప్ వంగా డైరెక్షన్ చేస్తేనే రీమేక్ చేస్తానని షాహిద్ కపూర్ చెప్పాడంటేనే అర్ధం చేసుకోవచ్చు సందీప్ కి ఎంత క్రేజ్ ఉందో. ఇక షాహిద్ కోరిక మేరకు హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
ఫ్రెండ్స్ ను సర్ప్రైజ్ చేయండి
సినిమాల్లోనే కాదు మాములుగా కూడా హీరోయిన్ రష్మిక మందన్న చాలా యాక్టీవ్ అని తన చేసేపనులను బట్టి చెప్పొచ్చు. ఎంతో చలాకీగా కనిపిస్తూ చిలిపి చిలిపిగా మాట్లాడుతూ అభిమానులందరినీ కట్టిపడేస్తే ఉంటుందిఅంతేకాదు సోషల్ మీడియాలోనే కూడా రష్మిక చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తను చేసే చిన్న ఛిన్న వంటకాలు, వర్క్ఔట్స్, సినిమాలు ఇలా పలు విషయాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా తన ఇన్‌స్టా లో మరో వీడియో పోస్ట్ చేయగా.. ఇప్పుడు నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే..
న్యూ క్యారెక్టర్ లో నిఖిల్
"హ్యాపీ డేస్ " మూవీ లో ఇంజనీరింగ్ స్టూడెంట్ , "యువత "మూవీ లో విలేజ్ యువకుడు , "స్వామి రారా "మూవీ లో పిక్ పాకెటర్ , "కార్తికేయ "మూవీ లో మెడికల్ స్టూడెంట్ ; "ఎక్కడికి పోతావు చిన్నవాడా "మూవీ లో ప్రేమికుడు , "అర్జున్ సురవరం "మూవీ లో డేరింగ్ జర్నలిస్ట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నిఖిల్ ప్రేక్షకులను అలరించారు. వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న హీరో నిఖిల్ ప్రస్తుతం "18 పేజెస్ ", "కార్తికేయ 2 " మూవీస్ లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
‘తిమ్మరుసు’ అఫీషియల్ గా లాంచ్
టాలీవుడ్ లో ఉన్న టాలెంటడ్ నటుల్లో సత్యదేవ్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మరోసారి తన నట నిజస్వరూపం చూపించాడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు.

USA & జపాన్ లలో "బాహుబలి 2 ", "సాహో " రీ రిలీజ్
బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2" మూవీస్ ద్వారా హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దేశ విదేశాలలో ప్రభాస్ కు అభిమాన గణం పెరిగింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సాహో "మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు కలెక్ట్ చేసింది. కొవిడ్ -19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ బంద్ అయిన విషయం తెలిసిందే. కొన్ని నిబంధనలు , గైడ్ లైన్స్ తో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి.
'ఆర్ఆర్ఆర్' - భీం టీజర్ కు ముహూర్తం ఫిక్స్
కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమాతో తన సత్తా చాటిన రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఆ మాత్రం క్యూరియాసిటీ ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఇక ఇన్ని రోజులు కరోనా వల్ల షూటింగ్ కు దూరంగా ఉన్న టీమ్ రీసెంట్ గానే షూట్ ను స్టార్ట్ చేసింది. అంతేకాదు స్టార్ట్ చేస్తూ ఎన్టీఆర్ టీజర్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక అప్పటినుండి ఆ తరుణం కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఆ ఘనత మనవాళ్లదే ..!
మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది లెజెండ్రీస్ ఉన్నారు. ఈ తరం వాళ్లు స్ఫూర్తి పొందడానికి ఎంతో మంది నుండి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకోడానికి ఎంతో మంది ఆదర్శవంతులు ఉన్నారు. అందుకే తెలుగు ఇండస్ట్రీ రోజుకు రోజుకు అభివృద్ది చెందుతుందే తప్పా ఎప్పుడూ వెనుకపడలేదు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న సినిమా కథలను తీసుకొని రీమేక్ చేస్తున్నారంటేనే చెప్పుకోవచ్చు మన తెలుగు సినిమా అనేది ఎంత ముందడుగులో ఉందో. ఇక మన తెలుగు సినీ చరిత్రలో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
షూటింగ్ లో జాయిన్ అయిన రకుల్ ప్రీత్
తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ప్రస్తుతం దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో "ఉప్పెన " మూవీ ఫేమ్ వైష్ణవ తేజ్ హీరోగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. వికారాబాద్ అడవుల్లో షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేస్ లో రకుల్ ను సెప్టెంబర్ 25 వ తేదీ నార్కోటిక్ అధికారులు విచారించారు. అప్పటి నుండి రకుల్ షూటింగ్ లో పాల్గొనలేదు.
నిఖిల్ '18 పేజెస్' షూటింగ్ మొదలు
కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా '18 పేజెస్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చిలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కరోనా వలన షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే మళ్లీ ఇన్ని నెలలు తర్వాత షూట్ ను స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని స్వయంగా తెలియచేసారు చిత్రయూనిట్. ఈ సినిమాను నిర్మిస్తున్న గీతా ఆర్ట్స్ 2 సంస్థ తాజాగా లొకేషన్ లో పిక్ ను పోస్ట్ చేస్తూ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది.
భూమి పెడ్నేకర్ టాలీవుడ్ ఎంట్రీ ?
బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ లో 6 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన భూమి పెడ్నేకర్ బ్లాక్ బస్టర్ "దమ్ లగా కే హైసా "మూవీ తో బాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. "టాయ్ లెట్ : ఏక్ ప్రేమ్ కథ ", "శుభ్ మంగళ్ సావధాన్ ", "సాండ్ కి ఆంఖ్ ", "పతి పత్ని ఔర్ వో " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "సాండ్ కి ఆంఖ్ " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి భూమి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.

బిగ్ బాస్ 4 - 7వ వారం నామినేషన్స్ లిస్ట్
బిగ్ బాస్ - 4.. సక్సెస్ ఫుల్ గా 6వారాలు పూర్తి చేసుకున్న హౌస్ 7వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఎప్పటి లాగే పాటతో ఇంటి సభ్యులు నిద్రలేవగా.. ఆ తర్వాత ఎవరి పనులతో వారు బిజీ అయ్యారు. ఇక కుమార్ సాయి ఇచ్చిన బిగ్ బాంబ్ వల్ల మాస్టర్ బాత్రూం పరిసరాలను క్లీన్ చేసే పనిలో పడ్డారు. మరోపక్క హారిక పొడవాటి టీ-షర్ట్ ను వేసుకోగా దానికి హారిక ను ఒక రేంజ్ లో ఆడుకున్నాడు. అవినాష్ కామెడీకి పక్కనే ఉన్న అఖిల్, సోహైల్ నవ్వుకున్నారు.
ఐశ్వర్య రాజేష్ ‘భూమిక’ ఫస్ట్‌లుక్ రిలీజ్
విభిన్నమైన కథలతో.. తన నటనతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. ప్రస్తుతం ‘భూమిక’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది ఐశ్వర్య రాజేష్. ఈ థిల్లర్ ఐశ్వర్య రాజేశ్‌కి 25వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి రతీంద్రన్ ఆర్.ప్రసాద్ దర్శకత్వం వహిస్తుండగా.. స్టోన్ బెంచ్ ఫిల్మ్, ప్యాషన్ 8 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కార్తికేయన్ సంతానమ్, సుధాన్ సుందరమ్, జయరామన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ సైక్రియాటిస్టు పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
వర్క్ మోడ్ లో తాప్సీ
తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ తాప్సీ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తమిళ , హిందీ భాష చిత్రాల షూటింగ్స్ తో తాప్సీ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా "అన్నా బెల్లె "తమిళ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసి విహార యాత్రకు మాల్దీవులు వెళ్ళి తాప్సీ ఎంజాయ్ చేశారు. ఆ విహార యాత్రను ముగించుకుని తాప్సీ కొవిడ్ - 19 టెస్ట్ లో నెగటివ్ రావడంతో హిందీ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు.
రష్మిక ఇన్ స్టాగ్రామ్ రికార్డ్
బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కన్నడ హీరోయిన్ రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "గీత గోవిందం", "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కన్నడ భాషలో సూపర్ హిట్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక "సుల్తాన్ "మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. రష్మిక ప్రస్తుతం "పుష్ప "మూవీ లో నటిస్తున్నారు.
'స్టార్ ప్రొడ్యూసర్' కు 'సూపర్ స్టార్' విషెస్
సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. కేవలం వ్యక్తిగత విషయాలు..సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు.. మిగిలిన విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటూనే వుంటారు. ఇక ఈ రోజు అనిల్ సుంకర పుట్టిన రోజు కావడంతో ఆయనకు తన ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు.
భారీ వర్షాలపై విజయ్ దేవరకొండ స్పందన
గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయ్యింది. జన జీవనం అస్తవ్యస్త మైంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వందకు పైగా కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి . ఇళ్ళు కూలిపోయి , వాహనాలు కొట్టుకుపోయి , నిత్యావసరాలు తడిచిపోయి ప్రజలు తిండి , నిద్ర లేక అలమటిస్తున్నారు. వాగులు , వంకలు పొంగి , చెరువు కట్టలు తెగి తెలంగాణలో పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. నాలాలు పొంగి పొర్లాయి. మూసీ నది విశ్వరూపం దాల్చింది. పోలీసుల సాయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు జిహెచ్ఎంసి తరలిస్తోంది. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…
'నిత్యా' కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
విభిన్న పాత్రలు చేయడంలో నిత్యామీనన్ ఎప్పుడూ ముందుంటుంది. చాలా సెలక్టివ్ గా కథలు ఎంపిక చేసుకుంటూ.. ప్రతి కథలోనూ ఏదో ఒక వైవిద్యం ఉండేలా చూసుకుంటుంది నిత్యా మీనన్. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్లీ షూట్ లో పాల్గొంది నిత్యా మీనన్.

అనుపమకు "18 పేజెస్ " స్వాగతం
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "కుమారి21 F " మూవీ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "18 పేజెస్ " మూవీ రూపొందుతుంది. తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా ఎంపిక అయ్యారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.