అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ అవ్వగా దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి పలు పోస్టర్స్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. వాటితో పాటు సిద్ద్ శ్రీరామ్ పాడిన మనసా పాట కూడా బాగా ఆకట్టుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా ప్రీ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ప్రీ టీజర్ లో `హాయ్.. ఐ యామ్ హర్ష. ఒకబ్బాయి లైఫ్‌లో 50శాతం కెరీర్, మరో యాభై శాతం మ్యారీడ్ లైఫ్. కెరీర్‌ని సూపర్ గా సెట్ చేశా.. కానీ ఈ మ్యారీడ్ లైఫే.. అంటూ ఒంటికాలిపై నిలబడి రెండు చేతులు చాచి అయ్యయ్యో.. ` అంటూ తడబడుతున్నాడు. దీనితో ఈ ప్రీ టీజర్ బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు టీజర్‌ని దసరా కానుకగా ఈ నెల 25న ఉదయం 11.40 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు కూడా తెలిపారు.
Here is the pre-teaser of #MostEligibleBachelor
Teaser will be out on 25th Oct @ 11:40 AM 🤩#MEBPreTeaser @AkhilAkkineni8 @hegdepooja @baskifilmz @GopiSundarOffl #BunnyVas #VasuVarma @GA2Official pic.twitter.com/BuyvCtKIqc
— Geetha Arts (@GeethaArts) October 19, 2020
కాగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. మరి చూద్దాం ఈ సినిమాతో అయినా అఖిల్ మంచి బ్లాక్ బస్టర్ అందుకుంటాడో..? లేదో..?
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: