సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు ప్రభాస్. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఇక దీనితో పాటు మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఈసినిమాకు రాజాసాబ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను జరుపుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి తాజాగా ఒక ఇట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ హైదరాబాద్‌లో జరుగుతున్న రాజాసాబ్ షూట్లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. కొన్ని రోజులుగా జరగనున్న ఈ షూటింగ్లో ప్రభాస్, నిధి అగర్వాల్‌పై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.
కాగా ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈసినిమాకు సంగీతం అందించనున్నారు. కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్ గా.. రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా.. ఈ సినిమాకు కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: