దళపతి విజయ్ సినిమాలనుండి వస్తున్న సాంగ్స్ కు క్రేజ్ అంతా ఇంతా కాదు.రీసెంట్ గా లియో నుండి వచ్చిన నా రెడీ అలాగే వారిసు లోని రంజితమే అలాగే బీస్ట్ నుండి వచ్చిన అరబిక్ కుతు యూట్యూబ్ లో 24గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టి సెన్సేషన్ సృష్టించాయి.ఇందులో అరబిక్ కుతు 24 గంటల్లో 23.77 మిలియన్ల వ్యూస్ ను రాబట్టి సౌత్ ఇండియాలో 24గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన మొదటి సాంగ్ గా రికార్డు సృష్టించింది.అయితే ఇప్పుడు ఈ రికార్డు ను బ్రేక్ చేసింది విజిల్ పోడు సాంగ్.ఇక ఈసాంగ్ కూడా విజయ్ నటిస్తున్న సినిమాలోనేదే.విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెండు రోజుల క్రితం ఈసినిమా నుండి విజిల్ పోడు అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.ఈ సాంగ్ సింగిల్ లాంగ్వేజ్ 24గంటల్లో 24.88 మిలియన్ల వ్యూస్ ను రాబట్టి అరబిక్ కుతు రికార్డును బ్రేక్ చేసింది.విజిల్ పోడు సాంగ్ కు మొదట యావరేజ్ రేటింగ్స్ వచ్చిన వినగా వినగా బాగానే వుంది అనే టాక్ తెచ్చుకుంటుంది.
ఇక సౌత్ నుండి 24గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన లిరికల్ వీడియోల జాబితాలో తెలుగు నుండి ధమ్ మసాలా 17.42మిలియన్ల వ్యూస్ తో మూడో స్థానం లో వుంది.ఈసాంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారంలోనిది కాగా థమన్ సంగీతం అందించాడు.ఇక నాలుగు ,ఐదు స్థానాల్లో రంజితమే (16.68)మిలియన్లు ,నా రెడీ (16.54) మిలియన్ల వ్యూస్ తో వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: