హరిహర వీరమల్లు.. టీజర్ రిలీజ్ అప్‌డేట్

Power Star Pawan Kalyan's Hari Hara Veera Mallu Teaser Out Soon

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరిహర వీరమల్లు’ తదితర సినిమాల్లో కథానాయకుడిగా నటిస్తోన్న విషయం తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలు ఈ ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రాలతో పాటుగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. కాగా ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలు కావడం, వీటిని మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఈ సినిమాలపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవర్ స్టార్ అభిమానులైతే ఈ సినిమాల అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘హరిహర వీరమల్లు’ చిత్రం నుంచి సాలిడ్ అప్‌డేట్ అందించారు మేకర్స్. బుధవారం శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని చిత్ర బృందం ఈ మూవీ టీజర్ రిలీజ్ గురించి కీలక ప్రకటన చేసింది. అతి త్వరలోనే హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ న్యూ లుక్ పోస్టర్ ఒకటి విడుదల చేసింది.

ఈ పోస్టర్‌లో పవర్ స్టార్ కళ్ళు మాత్రమే కనిపిస్తుండగా.. ఎదురుగా పదునైన తల్వార్ తళుక్కుమంటోంది. అలాగే దీనికి “జై శ్రీరామ్… శ్రీరామనవమి శుభాకాంక్షలతో… 🏹. మీ ముందుకు… ‘ధర్మం కోసం యుధ్ధం‘ త్వరలో” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఎంతో ఇంటెన్స్ లుక్ తో కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 19 =