ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు తీయాలంటే కొందరు డైరెక్టర్లు మాత్రమే తీయగలరు. అందులో డైరెక్టర్ పరుశురాం పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి కుటుంబ కథా చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ సినిమా మీద మరింత హైప్ పెంచుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా సక్సెస్ పై పరుశురాం సూపర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ఆయన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ‘ ఐ ఫీస్ట్ లాంటి “ఫ్యామిలీ స్టార్” సినిమాను, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను ప్రతి తెలుగు ప్రేక్షకుడు, ప్రతి తెలుగు కుటుంబం కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటారు.’ అని చెప్పారు. దానికి తగ్గట్టే ట్రైలర్ అదే రేంజ్ లో దూసుకుపోతుంది.
కాగా ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: