నితిన్ బర్త్ డే.. తమ్ముడు ఫస్ట్ లుక్ రిలీజ్

Nithiin's First Look Poster Released From Thammudu on His Birthday

టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ అయిన నితిన్.. తన కొత్త చిత్రానికి ఆయన సినిమా టైటిల్ నే పెట్టడం విశేషం. గతేడాది ఆగస్టులో హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ఈ మూవీకి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు-శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఇక యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ‘కాంతార ఫేం’ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శనివారం హీరో నితిన్ జన్మదినం. ఈ సందర్భంగా ‘తమ్ముడు’ చిత్ర బృందం ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో ఒక బస్సుపై నితిన్ శూలం పట్టుకుని కూర్చుని సీరియస్‌గా చూస్తున్నాడు. కాగా బస్సును ఆడవాళ్లు నడుపుతుండగా.. లోపల చాలామంది కూర్చుని కనిపించారు. చూడటానికి ఎంతో ఇంటెన్స్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్  చిత్రంపై ఆసక్తిని పెంచుతోంది. ఇదిలావుండగా.. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న హీరో నితిన్‌కు ఆయన అభిమానులు మరియు పలువురు నెటిజన్లు విషెస్ తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

ఇక ‘తమ్ముడు’ చిత్రంలో సీనియర్ నటి లయ ఒక కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఆమె చివరిసారిగా 2018లో రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో కనిపించిన విషయం గుర్తుండేవుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లయ దాదాపు ఆరేళ్ళ విరామం తర్వాత మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపిస్తుండటంతో మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తమ్ముడు డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫాం అమెజాన్ ప్రైమ్‌ వీడియో సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని అమెజాన్ని ప్రైమ్‌ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 17 =