బన్నీ బర్త్ డే కి పుష్ప 2 టీజర్ ఫిక్స్

allu arjun pushpa 2 movie teaser update

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప2. ఈసినిమా కోసం కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేయడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా బన్నీ పుట్టినరోజు ఏప్రిల్ 8వ తేదీ అన్న సంగతి తెలిసిందే కదా. దీంతో ఆ రోజు పుష్ప 2 సినిమా నుండి ఏదో ఒక అప్ డేట్ వస్తుందని ఇప్పటికే ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు బన్నీ బర్త్ డే కి మంచి ట్రీట్ రానుందని తెలుస్తుంది. సాధారణంగా తమ అభిమాన హీరో సినిమాల గురించి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు అడగటం చూస్తుంటాం. అలానే పుష్ప 2 అప్ డేట్ కోసం కూడా ఓ అభిమాని తన ట్విట్టర్ ద్వారా అప్ డేట్ కోసం ఏకంగా అల్లు అర్జున్ ఎక్స్‌క్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ చంద్రని అడిగారు. దానికి ఆయన తన ట్విట్టర్ ద్వారా బన్నీ బర్త్ డే కి టీజర్ ఉంటుంది ఫిక్స్ అంటూ రిప్లై ఇచ్చారు. ఇక దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ లో ఉన్నారు.

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. జగపతిబాబు, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 6 =