ఇండియా లోనే తెలుగు ఆడియన్స్ టాప్

Telugu audience holds top positions among moviegoers in India

మన ఇండియన్స్ కు ఉన్న ఎంటర్ టైన్ మెంట్స్ లో సినిమా అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. కొత్త సినిమా వచ్చిందంటే చాలు ఫస్ట్ డే ఫస్ షోకి పక్కా వెళ్లాలి అనుకునే వాళ్లే చాలా మంది ఉంటారు. ఒకప్పుడు కొత్త సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద జాతరల ఉండేది. అయితే కరోనా వల్ల గడచిన మూడేళ్లలో థియేటర్ల ప్రభావం కాస్త తగ్గింది. దానికి తోడు ఓటీటీ లు కూడా ఎక్కువవ్వడం.. మరోవైపు టికెట్ రేట్లు పెరగడం.. ఇవన్నీ ఒకఎత్తైతే టికెట్ రేట్ల కంటే అక్కడ అమ్మే స్నాక్స్ రేట్లు ఆకాశాన్ని అంటటం..సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు అనే ఆలోచనకి కూడా చాలా మంది వచ్చేయడం.. కారణం ఏదైనా కానీ థియేటర్లకు వచ్చే జనం బాగా తగ్గిపోయారు. ఎలాగూ ఓటీటీ లు ఉన్నాయి.. కానీ థియేటర్లలో చూసిన సినిమాకు ఇంట్లో చూసిన సినిమాకు చాలా తేడా ఉంటుంది. థియేటర్ లో సినిమా చూస్తే వచ్చే కిక్కే వేరు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పుడు మళ్లీ పాత రోజులు వచ్చినట్టే కనిపిస్తుంది. ఆర్ మ్యాక్స్ మీడియా తాజాగా చేసిన ఒక సర్వే ప్రకారం 2023 లో థియేటర్లలో చూసే వారి సంఖ్య పెరిగినట్టు ఈ సర్వే ద్వారా తెలుస్తుంది. 2020 లో పాండమిక్ వల్ల థియేటర్లు క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత 2021 ఇంకా 2022లో కూడా థియేటర్లు ఓపెన్ అయినా పెద్దగా ఆడియన్స్ రాలేకపోయారు. కానీ 2023లో పరిస్థితి మారిపోయింది. పాజిటివ్ గ్రోత్ కనిపిస్తుంది. గత ఏడాది థియేటర్లలో సినిమా చూసిన వారి సంఖ్య 29శాతానికి పెరిగింది. ప్రీ పాండమిక్ తో పోల్చుకుంటే 8 శాతం పెరగడం విశేషం.

తెలుగు ఆడియన్స్ టాప్
ఇక 157 మిలియన్ సినీ గోర్స్ ఉండగా దాదాపు 943 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. అంటే ఒక్కో వ్యక్తి ఒక సంవత్సరానికి యావరేజ్ గా 6 సినిమాలు చూసినట్టు లెక్క. ఈలెక్క లాంగ్వేజ్ ను బట్టి మారినట్టు తెలుస్తుంది. అయితే తెలుగులో అయితే ఒక వ్యక్తి ఏడాదికి యావరేజ్ గా 9 సినిమాలు చూసినట్టు తెలుస్తుంది. ఇక తమిళ్ లో 8, పంజాబీ లో 5, హిందీలో యావరేజ్ కి 3 సినిమాలు చూస్తున్నట్టు తేలింది. దీంతో మరోసారి తెలుగు ప్రేక్షకులు సినిమా అంటే తమకు ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పారు.

ఇదిలా ఉండగా గత ఏడాది తెలుగులో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని చిన్న సినిమాలూ ఉన్నాయి.. కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. దసరా, విరూపాక్ష, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, సార్, వారసుడు, వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, లియో, జైలర్, సామజవరగమన, బలగం, బేబి, రైటర్ పద్మభూషణం ఇలా పలు సినిమాలు బాక్సీఫీస్ వద్ద విజయాలను అందించాయి.

మరి ఇలానే వచ్చే ఏడాదికి ఈ సంఖ్య ఇంకా పెరగాలని.. థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం వచ్చి కళకళలాడిపోవాలని కోరుకుందాం..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 8 =