గత ఏడాది లో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అనిపించుకుంది యంగ్ హీరోయిన్ శ్రీ లీల.సెప్టెంబర్ నుండి ఈ జనవరి వరకు నెలకో సినిమా తో పలకరించింది. సెప్టెంబర్ లో స్కంద తో రాగ అక్టోబర్ లో భగవంత్ కేసరితో వచ్చింది అయితే ఇందులో హీరోయిన్ గా కాకుండా బాలయ్య కు కూతురిగా నటించింది.ఈసినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఆ తరువాత నవంబర్ లో ఆమె హీరోయిన్ గా నటించిన ఆదికేశవ రిలీజైయింది.వైష్ణవ తేజ్ హీరోగా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.ఇక డిసెంబర్ లో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ తో అలాగే ఈ జనవరి లో గుంటూరు కారంతో వచ్చింది.
అలా వరస ఆఫర్ల తో తీరిక లేకుండా గడిపిన శ్రీ లీలకు ప్రస్తుతం చేతిలో రెండు ప్రాజెక్ట్ లు మాత్రమే వున్నాయి.అందులో క్రేజీ సినిమా ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్.పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబో లో వస్తున్న ఈసినిమాలో శ్రీ లీల ఓ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఈసినిమా కాకుండా శ్రీ లీల ప్రస్తుతం జూనియర్ అనే కన్నడ సినిమాను కూడా చేస్తుంది.కిరిటీ రెడ్డి హీరోగా నటిస్తుండగా జెనీలియా కీలక పాత్రలో కనిపించనుంది.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.ఇందులో శ్రీ లీల కూడా జాయిన్ అయ్యింది.లీడ్ పెయిర్ పై సాంగ్ ను షూట్ చేస్తున్నారు.ఈసినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: