ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి హనుమాన్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో చెప్పనక్కర్లేదు.స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డులను అందుకుంది.ప్రపంచ వ్యాప్తంగా 300కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం సంక్రాంతి గ్రాసర్ గా నిలిచింది.ఇక ఈసినిమా థియేటర్లలోనే కాదు ఓటీటీ లోనూ అదిరిపోయే రెస్సాన్స్ ను తెచ్చుకుంది.రీసెంట్ గా తెలుగు వెర్షన్ జీ 5లో స్ట్రీమింగ్ లోకి రాగ అతి తక్కువ సమయంలోనే రికార్డు వ్యూస్ ను రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక హిందీ వెర్షన్ జియో సినిమాలో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.మిగిలిన కన్నడ ,తమిళ ,మలయాళ వెర్షన్ లు మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.ఏప్రిల్ 5న ఈ వెర్షన్ లు స్ట్రీమింగ్ లోకి రానున్నాయని హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపాడు.అలా మొత్తం మూడు ఓటిటి ల్లో హనుమాన్ స్ట్రీమింగ్ కానుంది.
సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈసినిమాలో విజువల్స్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా చివరి 20నిమిషాలు వావ్ అనిపించాయి.తేజ సజ్జ హీరోగా నటించగా అతనికి జోడిగా అమృతా అయ్యర్ కనిపించింది.సముద్రఖని ,వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించారు.ప్రైమ్ షో ఎంటెర్టైమెంట్ ఈసినిమాను నిర్మించింది.ఇక ఈసినిమా కు సీక్వెల్ కూడా రానుంది.జై హనుమాన్ అనే టైటిల్ తో ఈ సీక్వెల్ తెరకెక్కనుంది.ఈఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: