టాలీవుడ్ లో ఉన్న కూల్ డైరెక్టర్ ఎవరంటే శేఖర్ కమ్ముల పేరు ముందు వినిపిస్తుంది. ఫీల్ గుడ్ సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఇక శేఖర్ కమ్ముల నుండి వచ్చిన సినిమానే హ్యాపీడేస్. కళాశాల నేపథ్యంలో వచ్చిన ఈసినిమా 2007వ సంవత్సరంలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈసినిమాలో కాలేజీ లైఫ్‌తో పాటు… అందులోని స్నేహాలను, ప్రేమలను తనదైన శైలిలో చూపించాడు శేఖర్ కమ్ముల.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా మళ్లీ రీ రిలీజ్ కు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఫైనల్ గా రీరిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 12వ తేదీన ఈసినిమాను రీరిలీజ్ చేయనున్నారు. గ్లోబల్ సినిమాస్, అమిగోస్ క్రియేషన్, ఏషియన్ సినిమాస్ వారు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేయనున్నారు.
Everyone’s favorite #HappyDays is bringing us back to our college days 😍
Let’s relive those moments once again in theaters from April 12th
A @sekharkammula film 🥳
AP/TS Release by @CinemasGlobal@AsianCinemas_ @amigoscreation pic.twitter.com/0wSkAQNcce
— Asian Cinemas (@AsianCinemas_) March 26, 2024
కాగా ఈసినిమాలో ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ సిద్ధార్థ్, గాయత్రిరావు, రాహుల్, సోనియా దీప్తి, వంశీ చాగంటి, మొనాలి చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు. కమలినీ ముఖర్జీ, రణధీర్ గట్ల, ఆదర్శ్ బాలకృష్ణ, కృష్ణుడు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శేఖర్ కమ్ముల ఈసినిమాను నిర్మించారు. మిక్కీ జే మేయర్ ఈసినిమాకు మ్యూజిక్ అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: