ఇప్పడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఆ కోవలోనే 2012, మార్చి 23న విడుదలై యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కుర్రకారుని ఆకట్టుకుని సంచలన విజయం సాధించిన చిత్రం ‘ఈ రోజుల్లో’. ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ల కాలం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు మేకర్స్. సినిమా విడుదలైన 12 సంవత్సరాలకు మళ్లీ అదే రోజు అంటే మార్చి 23నే ఈ చిత్రం రీరిలీజ్ కావడం విశేషం. ఎన్నో సంచలనాలకు తెరలేపిన ట్రెండ్‌సెట్టర్ ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను మళ్లీ చూడాలని అందరూ కోరుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై క్రియేటివ్ దర్శకుడు మారుతీ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా ‘ఈ రోజుల్లో’. శ్రీనివాస్, రేష్మ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి జేబి సంగీతం అందించాడు. ఎస్‌కేఎన్, శ్రేయాస్ శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఈరోజు మళ్ళీ విడుదల అవుతోంది. ఈ సందర్బంగా శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. “ఈ సినిమా విడుదలైన 12 సంవత్సరాల తరువాత మళ్లీ ఈ సినిమాను రీరిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా వుంది. చాలా చిన్న బడ్జెట్‌తో సరదాగా చేసిన సినిమా ఇది. మా జీవితాలను మార్చిన సినిమా ఇది” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ “గత 12 సంవత్సరలుగా మా ముగ్గురి జర్ని కూడా ఎంతో సక్సెస్‌ఫుల్ కంటిన్యూ అవుతోంది. ఈ సినిమా చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా వుంటుంది. అందుకే ఎస్‌కేఎస్, శ్రీనివాస్ పూనుకుని ఈ సినిమా స్వీట్ మొమరీస్‌ను అందరికి గుర్తు చేస్తే బాగుంటుందని ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నాం. 12 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమా మళ్ళీ ఇప్పడు బిగ్ స్కీన్‌పై చూసుకోవడం చాలా సంతోషంగా వుంది. మా లైఫ్‌లు టర్న్ చేసిన సినిమా ఇది. ఈ స్వీట్ మొమెరీని అందరూ మరోసారి గుర్తు చేసుకుని సినిమాను చూసి మళ్లీ ఆనందించాలని కోరుకుంటున్నాను” అని దర్శకుడు మారుతి అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: