రీ రిలీజ్ కానున్న ఆర్య 2 

Arya2 will be rereleased in theaters soon

టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతూనే వుంది.ఈజాబితాలోకి ఇప్పుడు మరో సినిమా చేరింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య 2 రీ రిలీజ్ కు రెడీ అవుతుంది.వచ్చే నెల 8న అల్లు అర్జున్ తన బర్త్ డే ను జరుపుకోనున్నాడు.ఈసందర్బంగా ఆర్య 2 రీ రిలీజ్ కానుంది.2009 లో వచ్చిన ఈసినిమాకు థియేటర్లలో అంతగా రెస్పాన్స్ రాలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాక్ బాగేనా వచ్చింది కానీ కమర్షియల్ గా అంతగా వర్క్ అవుట్ కాలేదు.సుకుమార్ మార్క్ డైరెక్షన్ ,అల్లు అర్జున్ లుక్ ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.ఇక ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతున్న ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

ఇదిలావుంటే ప్రస్తుతం అల్లు అర్జున్,సుకుమార్ కాంబో లో పుష్ప 2 తెరకెక్కుతుంది.పార్ట్ 1 బ్లాక్ బాస్టర్ కావడంతో సీక్వెల్ ఫై భారీ అంచనాలు వున్నాయి.గత కొన్ని నెలల నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఈ ఆగస్టు 15న విడుదలకానుంది.అన్ని కుదిరితే అల్లు అర్జున్ బర్త్ డే రోజు ఈసినిమా నుండి అప్డేట్ రానుంది.దీంతో పాటు అదే రోజున బన్నీ నెక్స్ట్ మూవీ గురించి కూడా అప్డేట్ వచ్చే అవకాశాలు వున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =