హీరోగా చేసిన నాలుగో సినిమాతోనే 300కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ సృష్టించాడు యంగ్ హీరో తేజ సజ్జ.ఈసంక్రాంతికి తాను నటించిన హనుమాన్ చిన్న సినిమాగా వచ్చి రికార్డులు బ్రేక్ చేయడం తో పాటు ఊహించని లాభాలను తీసుకొచ్చింది.హిందీలోకూడా ఈసినిమా బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఇక ఈసినిమా తరువాత తేజ సజ్జ రొటీన్ సినిమాలు చేయకుండా డిఫ్రెంట్ కంటెంట్ వున్న సినిమాలకు సైన్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో భాగంగా ప్రస్తుతం ఈ హీరో మిరాయ్ అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని ఈసినిమా ను డైరెక్ట్ చేస్తున్నాడు.రెండు రోజుల క్రితం టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అద్బుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ గ్లింప్స్ ఇప్పటివరకు 10మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ ను సొంతం చేసుకొని యూట్యూబ్ లో ట్రెండింగ్ లో రెండో స్థానం లో వుంది.
గ్లింప్స్ లో విజువల్స్ స్టన్నింగ్ అనిపించాయి.డిఫరెంట్ కాన్సెప్ట్ తో హాలీవుడ్ లెవెల్లో ఈసినిమాను తెరక్కిస్తున్నాడు కార్తిక్ ఘట్టమనేని.టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ అయితే యూనానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది.భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈసినిమా ను నిర్మిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 18న 7భాషల్లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.మరి ఈసినిమా కుడా తేజ కుమరో హనుమాన్ అవుతుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: