తన కెరీర్‌ను మలుపు తిప్పినవాటిలో మూడు సినిమాలు ఉన్నాయని, అవి తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. తాజాగా ఒక ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన తన సినిమా కెరీర్, ఫ్యామిలీ విషయాలు, రాజమౌళితో చేయబోయే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ సహా పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు తన తాజా చిత్రం గుంటూరు కారం మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇంటర్వ్యూలో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. “‘గుంటూరు కారం’ చిత్రంపై ప్రేక్షకులు చూపిన ఆదరణ ఆనందాన్ని ఇచ్చింది. ఈ ఉత్సాహంతో రాజమౌళి గారితో చేయబోయే చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. దీనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయని తెలుసు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి, త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుంది. ‘మురారి’, ‘పోకిరి’, ‘శ్రీమంతుడు’ చిత్రాలు నా కెరీర్‌ను మలుపు తిప్పాయి. ఈ సినిమాలు ప్రేక్షకుల ముందు నన్ను సరికొత్తగా ఆవిష్కరించాయి. నటుడిగా ప్రొఫెషనల్ లైఫ్ మరియు పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం. అయితే అభిమానులను అలరించేందుకు సవాళ్ళను స్వీకరించడానికి ఎప్పుడూ ముందుంటాను” అని తెలిపారు.
కాగా మహేష్ బాబు తదుపరి సినిమా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో చేయనున్న సంగతి తెలిసిందే. #ఎస్‌ఎస్‌ఎంబీ29గా వ్యవహరిస్తున్న ఈ పాన్ గ్లోబల్ అడ్వెంచర్ యాక్షన్ సినిమా కోసం మహేష్ ఇటీవలే స్పెషల్ ఫిట్‍నెస్ ట్రైనింగ్ తీసుకోవడానికి జర్మనీకి వెళ్లి వచ్చారు. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందుతుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ యాక్టర్స్ నటించనున్నారని కూడా అంటున్నారు. అయితే ఈ వార్తలకు సంబంధించి దర్శకుడు రాజమౌళి త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: