మహేష్ బాబు ‘మురారి’కి నేటితో 23 ఏళ్ళు పూర్తి

Mahesh Babu's Murari Movie Completed 23 Years

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రాలలో ‘మురారి’ సినిమాది ప్రత్యేక స్థానం. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించగా.. మహేష్ సరసన బాలీవుడ్ భామ సోనాలి బెంద్రే కథానాయికగా నటించింది. అలాగే సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీ రావు, అన్నపూర్ణ, ప్రసాద్ బాబు, లక్ష్మి, శివాజీ రాజా, చిన్నా, హేమ, అనిత చౌదరి, రవి బాబు, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక విశేషమేమంటే.. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న నందిని రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేయడం. కాగా ఈ మూవీ విడుదలై నేటికి 23 సంవత్సరాలు అయింది. ఈ నేపథ్యంలో మురారి చిత్రం గురించి స్పెషల్ స్టోరీ..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ‘రాజకుమారుడు’ మూవీతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు తొలిసారిగా ‘మురారి’తో సూపర్ హిట్ అందుకున్నారు. 2001లో విడుదలైన ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించి ఆయన సినీ కెరీర్‌లోనే మరపురాని చిత్రంగా ఇది నిలిచియింది. సరిగ్గా చెప్పాలంటే.. మహేష్ లోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. ముఖ్యంగా క్లైమాక్స్ ముందు రవిబాబుతో ఫైట్ తరువాత మహేష్ ప్రదర్శించిన నటనకు ప్రేక్షకులు మైమరచిపోయారు. సినీ విమర్శకులు సైతం ఆయన నటనను ప్రశంసించారు. తొలిసారి మహేష్ బాబు సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.

కాగా మహేష్ బాబుకి మురారి నాలుగో చిత్రం. నిజానికి దీనికి ముందు మహేష్ బాబు చేసిన రెండు సినిమాలు నిరాశపరచడంతో సూపర్ స్టార్ అభిమానులు ఒకింత నిరాశకు లోనయ్యారు. ఆ సమయంలో వచ్చిన ‘మురారి’ ఘన విజయం సాధించడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది.  ఈ మూవీలో నటనకి గానూ ఆయనకు స్పెషల్ జ్యూరీ నంది అవార్డు లభించింది. ఇక ఇందులో మహేష్ కి వరుసకు వదిన అయినా.. అమ్మ లాగా నటించిన లక్ష్మి కూడా ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు. అలాగే ఆ ఏడాది రెండో ఉత్తమ చిత్రంగా నంది అవార్డుకు ఎంపికైంది ఈ సినిమా.

ఇక మురారి చిత్రాన్ని మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద గల సుదర్శన్ థియేటర్‌లో కలిసి వీక్షించారు. సాధారణంగా కృష్ణ తనయుడిని ప్రశంసించడం జరగదు. అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఆయన ఏమీ మాట్లాడకుండా మహేష్ భుజాల మీద చేతులు వేసి గట్టిగా పట్టుకున్నారు. ఈ విధంగా మాటలతో కాకుండా తన చేతలతో తనయుడిని మెచ్చుకున్నారు. ఆరోజు కృష్ణ చేసిన ఆ చర్య తనకు జీవితాంతం గుర్తుండిపోయే సంఘటనగా ఎన్నోసార్లు చెప్పారు మహేష్.

అలాగే మహేష్ సోదరి, నటి మంజుల కూడా మురారి చూసి ‘నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’ అని తమ్ముడికి చెప్పారట. ఇక మురారి థియేటర్లలోనే కాదు.. బుల్లితెరపై కూడా ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. కాగా ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =