ఎంత స్టార్ డమ్ వచ్చినా కూడా కొంతమంది సెలబ్రిటీలు ఎంతో సింప్లిసిటీ ని మెయిన్ టైన్ చేస్తుంటారు. ఇక ఇక్కడ ఓ స్టార్ హీరో కూడా తన సింప్లిసిటీతో ఫిదా చేస్తున్నాడు. ఆ హీరో ఎవరో కాదు కె.జి.యఫ్ తో దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న యష్. రోడ్డు పక్కన ఉన్న ఓ షాప్ దగ్గర ఆగి తన కూతురికి ఏదో కొనిస్తున్నాడు. ప్రస్తుతం ఈఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫొటోలో భార్య రాధిక దుకాణం ముందు ఉన్న బెంచీపై కూర్చొని భర్త వైపు చూస్తూ ఈ ఫొటోలో కనిపించింది. కాగా ఇటీవలే తన భార్య, ప్రముఖ నటి రాధిక పండిట్, కూతురు ఐరాతో కలిసి కర్ణాటకలోని భత్కల్ జిల్లా షిరాలీలో ఉన్న ప్రసిద్ధ చిత్రపూర్ మఠాన్ని యశ్ సందర్శించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కె.జి.యఫ్ సినిమాతో కన్నడ రాక్ స్టార్ యష్ దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడో తెలిసిందే కదా. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక దీని సీక్వెల్ గా వచ్చిన కె.జి.యఫ్ 2 కూడా రీసెంట్ గానే రిలీజ్ అయి మరో సంచలనం సృష్టిస్తుంది. ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఉండగా.. ఆ అంచనాలను ఎక్కడా తగ్గించకుండా రాఖీభాయ్ తన సత్తా చూపించాడు. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. ఈమధ్యనే ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు. ‘టాక్సిక్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కాగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: