కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా #SK21 వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఉలగనాయగన్ కమల్ హాసన్ హోం బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మరియు సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో ఇది రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో శివకార్తికేయన్‌కు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్‌డేట్ అందించారు మేకర్స్. త్వరలోనే ఈ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనిప్రకారం.. ఫిబ్రవరి 16న #SK21 టైటిల్ టీజర్‌ని లాంచ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఒక స్టన్నింగ్ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో హీరో శివకార్తికేయన్ జిమ్‌లో ఇంటెన్స్ వర్క్ ఔట్స్ చేస్తూ కనిపించారు. అలాగే డిఫరెంట్ గన్స్‌ని ఫైర్ చేస్తూ కనిపించడం సినిమాపై క్యూరియాసిటీ పెంచింది.
#SK21లో శివకార్తికేయన్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా బిగ్ స్క్రీన్ పై ప్రజంట్ చేయనున్నారు. ‘గట్స్ అండ్ గోర్’ దేశభక్తి కథాంశంతో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. కాగా ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ జివి ప్రకాష్ సంగీతం సమకూరుస్తుండగా.. ప్రొడక్షన్ డిజైనర్‌గా రాజీవన్, సినిమాటోగ్రాఫర్‌గా సిహెచ్ సాయి పనిచేస్తున్నారు. అలాగే ఆర్. కలైవానన్ ఎడిటర్‌గా, స్టీఫన్ రిక్టర్ యాక్షన్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: