ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది. ప్రశాంత్ మేకింగ్, తేజ నటన, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బ్లాక్ బస్టర్ ను అందించాయి. ఇక కలెక్షన్స్ పరంగా ఈసినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టిస్తుంది. కేవలం 10 రోజుల్లోనే ఈసినిమా 200 కోట్ల క్లబ్ లోకి చేరింది. అంతేకాదు 92 సంవత్సరాల తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పటివరకూ వచ్చిన తెలుగు సినిమాలలో ఆల్-టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 25 రోజుల్లో 300 కోట్లను కలెక్ట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా హిందీలో ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి ఇంతవరకూ హనుమాన్ హవా మాత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తగ్గలేదు. అందుకే సాలిడ్ కలెక్షన్స్ ను అందుకొని దుమ్ముదులుపుతుంది. ఇక అక్కడ ఈసినిమా కలెక్షన్స్ కు సంబంధించిన అప్ డేట్లను ప్రముఖ సినీ క్రిటిక్ అయిన తరుణ్ ఆదర్శ్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాడు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా బాలీవుడ్ లో 50 కోట్ల క్లబ్ లో చేరినట్టు తెలిపాడు. ఈనేపథ్యంలో ప్రశాంత్ వర్మ హిందీ ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పాడు. టీజర్ లాంచ్ నుండి, సినిమా గ్రాండ్ రిలీజ్ వరకూ హిందీ ఆడియెన్స్ నుండి మంచి సపోర్ట్ లభించింది. ఈసినిమాను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ తరుణ్ ఆదర్శ ట్వీట్ కు రిప్లై ఇచ్చాడు.
From the teaser launch to the grand release, the love and support from the Hindi audience have been overwhelming. Immensely grateful to each one of you for embracing #HanuMan and making it a part of your lives.🙏🏻@Primeshowtweets @RKDStudios https://t.co/WRMxBMK0Vs
— Prasanth Varma (@PrasanthVarma) February 12, 2024
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: